Begin typing your search above and press return to search.

ఆపరేషన్ వాలెంటైన్.. ఆ చిక్కు తప్పదా?

ఎందుకంటే ఈ సినిమా పుల్వామా దాడి తర్వాత భారత వైమానిక దళం తీర్చుకున్న ప్రతీకారం చుట్టూ తిరుగుతుంది. సాధారణంగా పాకిస్థాన్ను యాంటీగా చూపించే చిత్రాలను గల్ఫ్ దేశాలు ప్రోత్సహించవు, ప్రదర్శించవు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 5:51 AM GMT
ఆపరేషన్ వాలెంటైన్.. ఆ చిక్కు తప్పదా?
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. మరో రెండు రోజుల్లో ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇండియన్ ఎయిర్ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవర్ ఫుల్ వైమానిక దళ అధికారిగా వరుణ్ కనిపించనున్నారు. హైడోస్ యాక్షన్ విజువల్స్ ఉన్న ట్రైలర్.. మూవీపై మరింత బజ్ క్రియేట్ చేసింది. మార్చి 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించాలనుకుంటే పొందాల్సిన అన్ని అనుమతులను రక్షణ శాఖ నుంచి ఆపరేషన్ వాలెంటైన్ మేకర్స్ తీసుకున్నారు. ఇప్పటి వరకు పుల్వామా దాడి ఆధారంగా 16 మూవీ స్క్రిప్టులు రాగా.. వరుణ్ సినిమాకు మాత్రమే పర్మిషన్ దక్కింది. రక్షణ శాఖ తెలిపిన నిబంధనలన్నిటిని మేకర్స్ పాటించారు. అధికారుల మద్దతుతో గ్యాలియర్ లో 40 రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు.

ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ మూవీపై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా పుల్వామా దాడి తర్వాత భారత వైమానిక దళం తీర్చుకున్న ప్రతీకారం చుట్టూ తిరుగుతుంది. సాధారణంగా పాకిస్థాన్ను యాంటీగా చూపించే చిత్రాలను గల్ఫ్ దేశాలు ప్రోత్సహించవు, ప్రదర్శించవు. ఇటీవల హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్ తో పాటు యామీ గౌతమ్ లీడ్ రోల్ లో చేసిన ఆర్టికల్ 370 మూవీపై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించాయి.

ఈ రెండు సినిమాలు కూడా బాలాకోట్ దాడులను ప్రస్తావించినందుకే నిషేధాన్ని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ కూడా ఇదే అంశాన్ని మరింత వివరంగా, సరైన రీతిలో చూపిస్తుంది. అందుకే ఈ మూవీని కూడా గల్ఫ్ దేశాలు నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వరుణ్ నటించిన రెగ్యులర్ తెలుగు సినిమా అయ్యి ఉంటే ఈ చిక్కులు వచ్చేవి కావు.

హిందీ, తెలుగులో ద్విభాషా చిత్రంగా ఆపరేషన్ వాలెంటైన్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ గ్రాండ్ గా నిర్మించింది. బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్.. ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ మూవీ.. శుక్రవారం విడుదల కానుంది. మరి ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం.. వరుణ్ తేజ్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.