Begin typing your search above and press return to search.

16 స్క్రిప్టులు.. ఒక్క వరుణ్ మూవీకే పర్మిషన్

మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ.. మరో మూడు రోజుల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Feb 2024 9:41 AM GMT
16 స్క్రిప్టులు.. ఒక్క వరుణ్ మూవీకే పర్మిషన్
X

మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ.. మరో మూడు రోజుల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రుద్రగా కనిపించనున్నారు వరుణ్. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. అయితే ఈ సినిమా పుల్వామా దాడి, ఆ తర్వాత భారత వైమానిక దళం తీర్చుకున్న ప్రతీకారం చుట్టూ తిరుగుతుందని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

అయితే భారతీయ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాస్తవిక సంఘటనలపై సినిమా తీయాలంటే రక్షణ శాఖ నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్మీ క్యాంపుల్లో మూవీ షూటింగ్స్ నిర్వహించాలన్నా కూడా సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్లు తప్పనిసరి. సినిమా మేకర్స్ అందించిన స్క్రిప్ట్ కు రక్షణ శాఖ ఆమోదం తెలిపితేనే ముందుకు ప్రొసీడ్ అవ్వాలి.

ఇక ఐదేళ్ల క్రితం జరిగిన పుల్వామా ఉగ్రదాడిపై సినిమా తీసేందుకు వివిధ నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన 16 స్క్రిప్ట్ లను రక్షణ శాఖ తిరస్కరించినట్లు తెలుస్తోంది. కానీ ఆపరేషన్ వాలెంటైన్ స్క్రిప్ట్ కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. స్క్రిప్ట్ లో వాస్తవిక విధానానికి అధికారులు కన్విన్స్ అయ్యారట. అయితే అత్యంత సురక్షితమైన గ్వాలియర్ వైమానిక దళ స్థావరంలో షూటింగ్ జరుపుకోవడానికి కూడా అనుమతులు పొందారు మేకర్స్.

దాదాపు 40 రోజుల పాటు గ్వాలియర్‌లోని వైమానిక దళ స్థావరంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు మేకర్స్. షూటింగ్ సమయంలో అధికారులు కూడా పూర్తి మద్దతు అందించారు. తాజాగా బయటకొచ్చిన ఈ విషయం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రక్షణ శాఖ అనుమతులు లభించాయంటే.. మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ద‌ర్శ‌కుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. రుహానీ శ‌ర్మ‌, న‌వ‌దీప్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సోనీ పిక్చ‌ర్స్‌తో క‌లిసి సందీప్ ముద్దా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ ట్రైలర్ 20 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కించుకుంది. మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.