Begin typing your search above and press return to search.

"వరుణ్ తేజ్" తో 'తుపాకీ' ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'

By:  Tupaki Desk   |   24 Feb 2024 9:47 AM GMT
వరుణ్ తేజ్ తో తుపాకీ ఎక్సక్లూసివ్  ఇంటర్వ్యూ
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఏరియల్ యాక్షన్ మూవీలో మానుషీ చిల్లార్, రుహానీ శర్మ హీరోయిన్లుగా నటించారు. సోనీ పిక్చర్స్, రెనైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. మార్చి 1న తెలుగు హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్న హీరో వరుణ్ తేజ్.. తాజాగా 'తుపాకీ డాట్ కామ్' కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

'ఆపరేషన్ వాలెంటైన్' అనేది ఎయిర్ ఫోర్స్ మీద తెలుగులో రాబోతున్న ఫస్ట్ ఏరియల్ బ్యాక్ డ్రాప్ మూవీ అని, పుల్వామా బాలాకోట్ దాడికి సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సినిమా అని వరుణ్ తేజ్ చెప్పారు. ఇందులో ఫైటర్ పైలట్ గా కనిపించనున్న వరుణ్.. పర్ఫెక్ట్ లుక్ కోసం ట్రైనింగ్ తీసుకున్నానని, కొందరు రియల్ ఫైటర్ పైలట్స్ ను కలిసి వారి నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నట్లు తెలిపారు. హిందీ డిక్సన్ కోసం రెండు నెలలు ట్రైనింగ్ తీసుకొని, స్వయంగా డబ్బింగ్ చెప్పానని అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత మన సైనికులపై 100 రెట్లు గౌరవం పెరుగుతుందని వరుణ్ తేజ్ చెప్పారు. ఆయన చెప్పిన మరిన్ని విశేషాల కోసం ఈ ఫుల్ ఇంటర్వ్యూ చూడండి...