Begin typing your search above and press return to search.

ఆపరేషన్ వాలెంటైన్.. రవితేజ వేలో వరుణ్!

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ దూసుకుపోతోంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:30 PM GMT
ఆపరేషన్ వాలెంటైన్.. రవితేజ వేలో వరుణ్!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. గట్టి హిట్ కోసం గత కొన్నేళ్లుగా ట్రై చేస్తున్నారు. గని, గాండీవధారి అర్జున వంటి సినిమాలు చేసినా.. సరైన హిట్ దక్కించుకోలేకపోయారు. ఎఫ్ 2, ఎఫ్ 3 మంచి వసూళ్లు సాధించినా.. వరుణ్ అకౌంట్లోకి రాలేదు. అయితే తన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. ప్రయోగాలు చేయడం మాత్రం ఆపలేదు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం వరుణ్.. ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో అలరించేందుకు రెడీ అయ్యారు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ నటిస్తోంది. పుల్వామా దాడి, ఆ తర్వాత పాక్ పై భారత వైమానిక దళం తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులో రామ్ చరణ్, హిందీలో సల్మాన్ రివీల్ చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, స్టంట్స్, పవర్ ఫుల్ డైలాగులతో ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ దూసుకుపోతోంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని యూట్యూబ్ లో నెం.1 ట్రెండింగ్ లో ఉంది. గూస్ బంప్స్ తెప్పించే ఎన్నో సీన్లు ఈ ట్రైలర్‌ లో కనిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కొత్త రకమైన అనుభూతిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఈ మూవీతోనే బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు వరుణ్ తేజ్. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ హిందీ వెర్షన్ కు వరుణే డబ్బింగ్ చెప్పారు. అందుకోసం స్పెషల్ ఇంట్రెస్ట్ తో హిందీ నేర్చుకున్నారు. వరుణ్ హిందీ డబ్బింగ్ కూడా బాగా కుదిరిందట. ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాకు రవితేజనే హిందీ డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు వరుణ్ కూడా అలానే చేశారు.

పాన్ ఇండియా లెవల్ లో తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఆపరేషన్ వాలెంటైన్ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్ కు పరిచయం కానుండగా.. మానుషి టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. మార్చి 1వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ... వరుణ్ కు కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.