Begin typing your search above and press return to search.

ఆపరేషన్ వాలెంటైన్.. బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో హిందీ, తెలుగు భాషలలో తెరకెక్కిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్

By:  Tupaki Desk   |   5 March 2024 4:14 AM GMT
ఆపరేషన్ వాలెంటైన్.. బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే?
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో హిందీ, తెలుగు భాషలలో తెరకెక్కిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్. పుల్వామా ఘటన తర్వాత పాకిస్థాన్ పై ఇండియా జరిపిన ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. కొన్ని ఎయిర్ ఫైటింగ్ సన్నివేశాలు సినిమాలో హైలెట్ అయ్యాయి. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

మార్చి 1న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమాలో కొన్ని సీక్వెన్స్ బాగున్నాయని, అయితే సినిమాలో మెజారిటీ హీరో, హీరోయిన్స్ మాత్రమే కనిపిస్తారనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వినిపించింది. యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ని ఆపరేషన్ వాలంటైన్ సొంతం చేసుకోలేకపోయింది.

శని, ఆది వారాల్లో కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. రెండో రోజు ఈ సినిమా 72 లక్షల వరకు షేర్ అందుకుంది. ఆదివారం మళ్ళీ డ్రాప్ అయ్యి 58 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 5.45 కోట్ల గ్రాస్ ని ఆపరేషన్ వాలంటైన్ కలెక్ట్ చేయగా అందులో 2.80 కోట్ల షేర్ ఉంది. సోమవారం రోజు కూడా పెద్దగా కలెక్షన్లు ఏమి రాలేదు. చాలా ఏరియాల్లో దారుణంగా డ్రాప్ అయ్యాయి.

ఈ సినిమా థీయాట్రికల్ రైట్స్ 17 కోట్లకి అమ్ముడయ్యాయి. ఇంకా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకోవాలంటే 15 కోట్లకి పైగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ మూవీకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదంటే వర్కింగ్ డేస్ లో మరింత డ్రాప్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఏ విధంగా చూసుకున్న కలెక్షన్స్ పరంగా పుంజుకునే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది.

దీంతో హ్యాట్రిక్ డిజాస్టర్ ని వరుణ్ తేజ్ తన ఖాతాలో వేసుకున్నట్లే. ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 0.85CR~

సీడెడ్ – 0.20CR~

టోటల్ ఏపీ - 1.05CR~

ఏపీ+తెలంగాణ టోటల్ కలెక్షన్స్ - 2.10RCR (4.05CR గ్రాస్)

కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా +ఓవర్సీస్ - 0.70CR

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 2.80CR(5.45CR Gross)