Begin typing your search above and press return to search.

సిందూర్ టైటిల్ కోసం కొట్లాట‌!

తాజాగా 'ఆప‌రేష‌న్ సిందూర్' టైటిల్ పై బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ల క‌న్ను ప‌డింది.

By:  Tupaki Desk   |   9 May 2025 1:09 PM IST
సిందూర్ టైటిల్ కోసం కొట్లాట‌!
X

'ఆప‌రేష‌న్ సిందూర్' తో దాయాదీ పాకిస్తాన్ గుండెల్లో ఒణుకు పుట్టించింది భార‌త్. ఊహించ‌ని తీరులో ఉగ్ర‌మూక‌ల‌పై విరుచుకుప‌డిన భార‌త్ తీరును యావ‌త్ ప్ర‌పంచం ప్ర‌శంసించింది. భార‌త మ‌హిళ‌ల‌కు జ‌రిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని స్వ‌యంగా ప్ర‌ధాని మోదీనే 'ఆప‌రేష‌న్ సిందూర్' అని నామ‌క ర‌ణం చేసారు. ఆప‌రేష‌న్ సిందూర్ అంటే ఉగ్ర‌మూక‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించేదిగా మారింది.

తాజాగా 'ఆప‌రేష‌న్ సిందూర్' టైటిల్ పై బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ల క‌న్ను ప‌డింది. ఇదే టైటిల్ తో సినిమా నిర్మించాల‌ని బ‌డా నిర్మాణ సంస్థ‌లు టైటిల్ కోసం పోటీ ప‌డుతున్నాయి. ఇండియ‌న్ మోష‌న్ పిక్చ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ అసోసియేష‌న్ లో జీ స్టూడియోస్ - టి సిరీస్ లాంటి సంస్థ‌లు టైటిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. దీనిలో భాగంగా టైటిల్ ను మొద‌ట‌గా మ‌హావీర్ జైన్ కంపెనీ రిజిస్ట‌ర్ చేసిన‌ట్లు తెలిసింది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌ల్లో ఒక‌రైనా అశోక్ పండిట్ స్పందించారు. 'అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే పేరున త‌మ సినిమాకు పెట్టాల‌ని ఆస‌క్తి చూపిస్తుంటారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ముందుగా పేరు అనుకోకుండా ఏ సినిమాను రూపొందించ‌లేం. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో చాలా మంది ఆప‌రేష‌న్ సిందూర్ టైటిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వారంతా క‌చ్చింగా సినిమా తీస్తార‌ని లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఆస‌క్తి త‌ర్వాత ఉండ‌క‌పోవ‌చ్చు' అన్నారు.

అలాగే జీ స్టూడియోస్ ఈ టైటిల్ ను విత్ డ్రా చేసుకున్న‌ట్లు ..ఈ టైటిల్ తో సినిమా తీయాల‌నే ఉద్దేశం త‌మ‌కు లేద‌న్నారు. పాకిస్తాన్ ఉగ్ర‌స్థావ‌రాల‌పై దెబ్బ కొట్టిన భార‌త సైనికుల ప‌ట్ల గ‌ర్వంగా ఉన్నామ‌ని తెలిపారు. ఇదే టైటిల్ టాలీవుడ్ ఫిలిం ఛాంబ‌ర్ లోనూ న‌మోద‌వుతున్న‌ట్లు స‌మాచారం. కొంత మంది నిర్మాత‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలిసింది. అయితే సిందూరం టైటిల్స్ తో ఇప్ప‌టికే కొన్ని సినిమాలు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.