ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెడితే.. రణ్‌వీర్ పోస్ట్ వైరల్
''ఎవరి పనులు వారు చేసుకుంటే మేం ఇబ్బంది పెట్టము.. కానీ ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెడితే వారిని వదిలిపెట్టము!'' అని పవర్ ఫుల్ క్యాప్షన్ ని ఇచ్చాడు.
By: Tupaki Desk | 11 May 2025 9:57 AM IST'ఆపరేషన్ సింధూర్' విజయవంతం అయిన తర్వాత భారత సైన్యం విజయానికి సెల్యూట్ కొట్టడంలో సెలబ్రిటీలు తమ పాత్రను విస్మరించలేదు. చాలా మంది బాలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలు భారత సైన్యానికి బాసటగా నిలిచారు. నటుడు రణ్‌వీర్ సింగ్ స్పందించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. రణవీర్ తన ఇన్‌స్టాలో ఆపరేషన్ సింధూర్ గ్రాఫిక్‌ను షేర్ చేసి ఇలా రాసాడు.
''ఎవరి పనులు వారు చేసుకుంటే మేం ఇబ్బంది పెట్టము.. కానీ ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెడితే వారిని వదిలిపెట్టము!'' అని పవర్ ఫుల్ క్యాప్షన్ ని ఇచ్చాడు. మన సాయుధ దళాల ధైర్యానికి, మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ నిర్ణయాత్మకతకు సెల్యూట్ అని నోట్ లో రాసాడు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ పెద్ద విజయం సాధించింది. పొరుగు దేశంలోని తొమ్మిది ప్రదేశాలలో ఉగ్రవాద శిబిరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. తర్వాత పాకిస్తాన్ తో యుద్ధం ముదిరింది. కానీ అంతర్జాతీయ సమాజం పిలుపు మేరకు, ఇరు దేశాలు కాల్పుల విరమణకు పిలుపునివ్వడం పెద్ద ట్విస్ట్ గా మారింది.
దేశాన్ని రక్షించడానికి రేయింబవళ్లు పనిచేసిన భారత సాయుధ దళాలకు చాలా మంది సెలబ్రిటీలు ధన్యవాదాలు తెలిపారు. కష్ట సమయంలో మనల్ని రక్షించినందుకు భారత సాయుధ దళాలను హీరోలుగా గౌరవించారు. అనుష్క భర్త, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా భారత సాయుధ దళాలకు సెల్యూట్ చేశారు.
