ప్రభాస్ బాహుబలి సినిమా చూస్తాను: మిస్ వరల్డ్ సుచాత
హైదరాబాద్‌లో జరిగిన అందాల పోటీల్లో థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచతా చువాంగ్‌శ్రీ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలుచుకుంది.
By: Tupaki Desk | 2 Jun 2025 9:24 AM ISTహైదరాబాద్‌లో జరిగిన అందాల పోటీల్లో థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచతా చువాంగ్‌శ్రీ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలుచుకుంది. ఓపల్ సుచతా చువాంగ్‌శ్రీ అందాల పోటీల్లో భాగంగా హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా మంది భారతీయ నటీమణులను కలుసుకున్నానని తెలిపింది. అంతేకాదు.. తనకు ఆలియా భట్ గురించి తెలుసునని అన్నారు. అలాగే ఇప్పటివరకూ భారతదేశం నుంచి వచ్చిన అందాల భామల్లో ఎవరంటే ఇష్టం? అని ప్రశ్నించగా, దానికి సమాధానం చెప్పడం సులువు కాదని, ప్రియాంక చోప్రా నుంచి స్ఫూర్తి పొందుతానని సుచతా ఓపల్ తెలిపింది.
అలాగే ఆలియా భట్ నటించిన గంగూభాయి కథియావాడీ సినిమా చూసానని, అది తనకు బాగా నచ్చిందని కూడా సుచాత తెలిపారు. తాను బాలీవుడ్ సినిమాలు చూస్తుంటానని కూడా వెల్లడించారు. పోటీల కోసం హైదరాబాద్ లో ఉన్న క్రమంలోనే ఒకసారి రామోజీ ఫిలింసిటీని విజిట్ చేసామని సుచాత తెలిపారు. బాహుబలి గురించి విన్నాను.. అందాల పోటీలు పూర్తయ్యాక తప్పకుండా ఈ సినిమా చూస్తాను! అని కూడా అన్నారు.
180 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి దాదాపు 17 ఏళ్ల థాయ్ ల్యాండ్ కళను నెరవేర్చింది సుచాత. అందాల రాణిగా గర్వంగా ట్రోఫీని తన దేశానికి అందించబోతోంది. సుచాత ఈ పోటీల్లో తన అందం కంటే, తెలివితేటలతో ప్రతి రౌండ్ లో నెగ్గుకు వచ్చింది. సుచాత కూడా ఇతర అందాల రాణుల్లానే సినీపరిశ్రమలో అడుగుపెట్టే ఆలోచనలో ఉంది. భవిష్యత్ లో భారతీయ సనిమాల్లో అవకాశాలిస్తే నటించేందుకు సిద్ధమేననే సంకేతాలు కూడా ఇచ్చింది.
