Begin typing your search above and press return to search.

ప్రీమియర్లకే కోటి.. ఊరి పేరు చెప్పి మరీ హిట్టు కొట్టేలా ఉన్నాడే!

టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న సూపర్‌ నేచురల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'

By:  Tupaki Desk   |   15 Feb 2024 9:35 AM GMT
ప్రీమియర్లకే కోటి.. ఊరి పేరు చెప్పి మరీ హిట్టు కొట్టేలా ఉన్నాడే!
X

టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న సూపర్‌ నేచురల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. ఈ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. 'టైగర్' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని, ప్రేక్షకులలో బజ్‌ ను క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో మేకర్స్ ముందుగానే ప్రీమియర్ షోలు వేయగా.. వీటికి అనూహ్య స్పందన లభించింది.


వాలెంటైన్స్ డే స్పెషల్ గా నిన్న ఫిబ్రవరి 14న తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో 'ఊరు పేరు భైరవకోన' సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. అయితే ఈ షోల నుంచి సినిమాకు యూనానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. దర్శకుడు వీఐ ఆనంద్ ఒక సరికొత్త ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అనుభవాన్ని అందించడానికి సినిమాను చాలా గ్రిప్పింగ్‌గా ఎంగేజింగ్ గా నడిపించారు. ఫస్టాఫ్ లో ఎన్నో ప్రశ్నలు మెదిలేలా చేస్తూ, సెకండాఫ్ లో ఒక్కో చిక్కు ముడిని విప్పుతూ కథను నడిపించిన విధానం బాగుందని సినిమా చూసిన వారు చెబుతున్నారు. సినిమాలో వచ్చే ఊహించని ట్విస్టులు కూడా జనాలను ఆకట్టుకుంటున్నాయి.

'ఊరు పేరు భైరవకోన' సినిమా కోసం రెండేళ్లపాటు కష్టపడిన హీరో సందీప్ కిషన్, తన అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇందులో అతను కొన్ని రిస్కీ స్టంట్స్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరూ తమ నటనతోనూ గ్లామర్ తోనూ ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ కూడా ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోంది. మొత్తం మీద ఎన్నో ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కి, ఈసారి బ్లాక్ బస్టర్ దక్కినట్లే అని టాక్ ని బట్టి అర్థమవుతోంది.

ఇక బ్లాక్‌ బస్టర్ ప్రీమియర్స్ నుంచి 'ఊరు పేరు భైరవకోన' మూవీ రూ. 1.1 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సినిమాకి ఇది అద్భుతమైన ప్రారంభం అని చెప్పాలి. నిజానికి రెండు రోజుల ముందు పెయిడ్ ప్రీమియర్ షోలు వేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్నది. ఏమాత్రం టాక్ తేడా కొట్టినా సినిమాకు ఓపెనింగ్స్ లేకుండా పోతాయి. అయితే మేకర్స్ మాత్రం కంటెంట్ పై ఉన్న ఈ చిత్రానికి ప్రీమియర్స్ వేశారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

'ఊరి పేరు భైరవకోన' చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చగా.. రాజ్ తోటసినిమాటోగ్రఫీ నిర్వహించారు.