ఊపిరి ఊయలలాగా.. వార్ 2 రొమాంటిక్ మ్యాజిక్
వార్ 2.. నెక్స్ట్ పాన్ ఇండియా మార్కెట్ ను బ్లాస్ట్ చేయడానికి సిద్దమవుతున్న సినిమా. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ భారీ సినిమాకు భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
By: M Prashanth | 31 July 2025 4:40 PM ISTవార్ 2.. నెక్స్ట్ పాన్ ఇండియా మార్కెట్ ను బ్లాస్ట్ చేయడానికి సిద్దమవుతున్న సినిమా. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ భారీ సినిమాకు భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక హీరోయిన్ గా కియారా అద్వానీ నటించగా, అగ్ర నిర్మాణ సంస్థ ఆదిత్య చోప్రా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.
తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట ‘ఊపిరి ఊయలలాగా’ను విడుదల చేశారు. హృతిక్ కియారా కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో హృతిక్ స్టైలిష్ లుక్‌తో పాటు, కియారా గ్లామర్ ఫుల్ ప్రెజెన్స్ అదనపు ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ మ్యూజిక్ లవర్స్‌కి తెలిసిన కేసరియా బృందం ఈ పాటను రూపొందించడం మరో విశేషం.హిందీలో ఈ పాటకు ప్రీతమ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించారు.
మ్యూజిక్ లవర్స్‌కు బాగా పరిచయమైన అరిజిత్ సింగ్ ఈ పాటను ఆలపించాడు. తెలుగులో చంద్రబోస్ అందించిన సాహిత్యం, శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ వాయిస్‌లలో ఈ పాటకు మళ్లీ ప్రత్యేకత తీసుకువచ్చాయి. ఆడియో ఆల్బమ్‌లో ఈ పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇంటర్నెట్‌లో ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. వన్ మిలియన్ వ్యూస్ కూడా దాటేసింది.
ముఖ్యంగా కియారా అద్వానీ పుట్టినరోజున ఈ పాట విడుదల చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పాటలోని లొకేషన్స్, డ్యాన్స్ మూమెంట్స్ సినిమాటోగ్రఫీతో కలిపి ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలో ఈ రొమాంటిక్ ట్రాక్ మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.
ఒకవైపు యాక్షన్, మరోవైపు మెలోడి.. రెండు వర్గాల ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వార్ 2 సాంగ్స్ ఉంటాయని మేకర్స్ ధీమాగా ఉన్నారు. సినిమా ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ట్రైలర్, సాంగ్స్‌తో భారీగా అంచనాలు పెరిగాయి. హృతిక్-కియారా కాంబో రొమాంటిక్ ఎమోషన్ స్క్రీన్‌పై ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
