Begin typing your search above and press return to search.

రెండు సీక్వెల్స్ లో ఒక్క‌రే..ఒక్క‌సారే!

రెండు సినిమా షూటింగ్ లు ఒకేసారి నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

By:  Tupaki Desk   |   21 Nov 2023 2:30 PM GMT
రెండు సీక్వెల్స్ లో ఒక్క‌రే..ఒక్క‌సారే!
X

'ఖైదీ' త‌ర్వాత కార్తీకి స‌రైన హిట్ ప‌డ‌లేదు. ఆ త‌ర్వాత న‌టించిన సోలో సినిమాలేవి ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. 'పొన్నియ‌న్ సెల్వ‌న్' హిట్ అయినా ఆ క్రెడిట్ అందులో న‌టించిన హీరోలంద‌రిది. కార్తీకే క‌ట్ట‌బెట్ట‌డానికి లేదు. ఆ ర‌కంగా కార్తీకి ఖైదీ త‌ర్వాత హిట్ లేద‌నే చెప్పాలి. 'తంబీ'.. 'సుల్తాన్' ..`స‌ర్దార్ ' లాంటి చిత్రాలేవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'జ‌పాన్' పరాజ‌యంతో కార్తీలో మేధో మ‌థ‌నం మొద‌లైంది.

ఎందుకిలా వ‌రుస‌గా వైఫ‌ల్యాలు ఎదుర‌వుతున్నాయని ఆలోచ‌న‌లో ప‌డ్డాడా? దీంతో లాభం లేద‌నుకున్న హిట్ సినిమాలకు సీక్వెల్ తోనే రావాల‌ని డిసైడ్ అయిన‌ట్లు తాజా లైన‌ప్ చూస్తుంటే తెలుస్తోంది. ఇటీవ‌లే `ఖాకీ` సినిమా సీక్వెల్ అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. హెచ్. వినోద్ -కార్తీ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ భారీ విజ‌యం సాధించింది. దీంతో అప్ప‌టి నుంచి సీక్వెల్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

అది ఇప్ప‌టికీ కుదిరింది. క‌థ స‌హా స‌ర్వం సిద్దం చేసి వినోద్ స‌ర్ ప్రైజ్ చేసారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది మిడ్ క‌ల్లా లేదా..చివ‌ర్లో ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తుంది. ఈ సీక్వెల్ పై భారీ అంచ‌నాలున్నాయి. ఇక లొకేష్ క‌న‌గ‌రాజ్` ఖైదీ` సీక్వెల్ కూడా 2024 లోనే ప్లాన్ చేస్తున్నారు. రెండు సినిమా షూటింగ్ లు ఒకేసారి నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

2024 ఏడాది చివ‌ర్లో షూటింగ్ ప్రారంభించాల‌ని లోకేష్ ప్లాన్ చేస్తున్నారుట‌. లొకేష్ ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కోసం క‌థ సిద్దం చేసే ప‌నిలో ఉన్నారు. త‌లైవా 171వ చిత్రం లోకేష్ తో లాక్ అయిన నేప‌థ్యంలో అదే ప‌నిలో ఉన్నారు. ఖైదీ సీక్వెల్ క‌థ ఇప్ప‌టికే సిద్దంగా ఉన్న నేప‌థ్యంలో స్టోరీ ప‌రంగా ఎలాంటి టెన్ష‌న్ లేదు. అందుకే ఖాకీ సీక్వెల్ తో పాటు త‌న సినిమా సీక్వెల్ కూడా ప్రారంభించాలి అన్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.