Begin typing your search above and press return to search.

మరోసారి బన్నీ - నాని.. సేమ్ టైమింగ్..

పుష్ప కంటే 10 రెట్లు గొప్పగా ఉండేలా పుష్ప ది రూల్ మూవీ కథని సుకుమార్ రెడీ చేసి అంతే అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   26 Feb 2024 3:53 AM GMT
మరోసారి బన్నీ - నాని.. సేమ్ టైమింగ్..
X

ఆగష్టు నెలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సుకుమార్ చాలా పకడ్బందీగా సినిమాని రెడీ చేస్తున్నాడు. పుష్ప కంటే 10 రెట్లు గొప్పగా ఉండేలా పుష్ప ది రూల్ మూవీ కథని సుకుమార్ రెడీ చేసి అంతే అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నార్త్ ఇండియాలో పుష్ప 2 కోసం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఇప్పటికే క్లోజ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆగష్టు నెలలోనే నేచురల్ స్టార్ నాని కూడా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.

పుష్ప 2 రిలీజ్ అయిన రెండు వారాల్లోనే తన కొత్త సినిమా సరిపోదా శనివారం మూవీని ఆగష్టు 29న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. నాని బర్త్ డే సందర్భంగా సరిపోదా శనివారం టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లో రిలీజ్ పై స్పష్టత ఇచ్చారు. వారం రోజులు వచ్చిన కోపాన్ని ఒక్క రోజు మాత్రమే చూపించే క్యారెక్టరైజేషన్ లో ఈ చిత్రంలో నాని కనిపిస్తున్నాడు.

ఓ విధంగా చెప్పాలంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ మూవీని వివేక్ ఆత్రేయ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నాడని టీజర్ బట్టి అర్ధమవుతోంది. 2021లో డిసెంబర్ 17న పుష్ప రిలీజ్ అయ్యింది. వారం రోజుల గ్యాప్ లో డిసెంబర్ 24న నాని శ్యామ్ సింగరాయ్ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఈ సారి ఆగష్టు లో రెండు వారాల గ్యాప్ లో వస్తోన్న పుష్ప 2, సరిపోదా శనివారం కూడా సూపర్ హిట్ కావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. నాని గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో రెండు కమర్షియల్ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. సరిపోదా శనివారంతో ఈ ఏడాది ఫస్ట్ సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు.