Begin typing your search above and press return to search.

OMG2 పై 'ఆదిపురుష్' పంచ్ అలా పడింది!

దేవుళ్లపై సినిమాలు తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు

By:  Tupaki Desk   |   14 July 2023 5:48 AM GMT
OMG2 పై ఆదిపురుష్ పంచ్ అలా పడింది!
X

దేవుళ్లపై సినిమాలు తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రజలు భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ప్రతి అంశంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తవ కథను డైవర్ట్ చేయకూడదు. దేవుళ్లను చెడుగా చూపించకూడదు. ఉన్నదున్నట్టు తెరపై ఆవిష్కరించాలి. అయితే ఈ విషయంలో ఆదిపురుష్ ఫెయిల్యూర్ ఒక గుణపాఠం లాంటిదని విశ్లేషిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ శ్రీరాముని కథ పురాణేతిహాసం రామాయణ కథ ఆధారంగా రూపొందింది. అయితే ఇందులో పాత్రధారుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలొచ్చాయి. ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా కంటెంట్ ఉందని ఇంతకుముందు కోర్టు కూడా తీర్పులో పేర్కొంది.

అయితే ఈ తీర్పు అనంతరం సీబీఎఫ్.సి సర్టిఫికేషన్ సంక్లిష్ఠంగా మారిందని టాక్ వినిపిస్తోంది. తాజా కథనాల ప్రకారం.. దేవుళ్ల నేపథ్యంలో ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ఓఎంజి2కి సెన్సార్ బోర్డ్ నుంచి చిక్కులు వచ్చి పడ్డాయని తెలుస్తోంది. ఓ మైగాడ్ 2(ఓఎంజీ2) చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి రిఫర్ చేయాలని CBFC నిర్ణయించినట్టు తెలిసింది. సినిమా సెన్సార్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు ఎగ్జామినింగ్ కమిటీ (EC) కంటెంట్ ని పరిశీలించి తగిన రేటింగ్ ను నిర్ణయిస్తుందని తెలిసింది. అంటే U లేదా A లేదా U/A వీటిలో ఏది ఇవ్వాలనేది రివైజింగ్ కమిటీ చూస్తుంది. అయితే కొన్ని సమయాల్లో EC ఆదేశించిన కోతలతో సంతృప్తి చెందకపోతే చిత్రనిర్మాతలు రివైజింగ్ కమిటీ (RC)ని ఆశ్రయిస్తారు. CBFC - EC మరియు చైర్ పర్సన్ స్వయంగా సినిమాని వీక్షించి తగిన తీర్పు ఇవ్వమని RCని అభ్యర్థించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

OMG ఓహ్ మై గాడ్ 2ని చూడమని EC ఇప్పటికే RCని కోరింది. ఈ చిత్రంలోని కంటెంట్ మతపరమైన అంశాలతో ముడిపడి ఉన్నది కాబట్టి CBFC కూడా జాగ్రత్తగా ఉందని చెబుతున్నారు. గతంలో ఆదిపురుష్ కు జీరో కట్స్ తో 'యు' సర్టిఫికెట్ ఇచ్చినందున సీబీఎఫ్సీ పై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసారు. సినిమా డైలాగ్స్ సహా కొన్ని సన్నివేశాలకు ప్రజలు అభ్యంతరం చెప్పారు.

అభ్యంతరకరంగా భావించే కంటెంట్ ను త్వరగా సెన్సార్ చేసే CBFC ఎలాంటి తొలగింపులు లేకుండా ఆదిపురుష్ ను ఎలా ఆమోదించింది అనే ప్రశ్నలు తలెత్తాయి. అందుకే ఆదిపురుష్ ఎపిసోడ్ తర్వాత CBFC మేనేజ్ మెంట్ ఓహ్ మై గాడ్ 2ని పాస్ చేయాలనుకునే అవకాశం ఉంది. కంటెంట్ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీయదని వారు ఖచ్చితంగా భావిస్తే మాత్రమే మంచి రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంది.

ఓఎంజి 2 విడుదలకు దాదాపు ఒక నెల సమయం ఉంది. కాబట్టి ఈ చిత్రానికి RC పాస్ అయితే మేకర్స్ సరైన సమయంలో సెన్సార్ సర్టిఫికేట్ పొందగలుగుతారు. ఒకవేళ చిత్రనిర్మాతలు RC సిఫార్సులతో సంతోషంగా లేకుంటే ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (FCAT)ని ఆశ్రయించే హక్కు వారికి ఉంది. తరచుగా ట్రిబ్యునల్ చాలా వరకూ.. సున్నితత్వం ఉదారవాదం .. సున్నా లేదా కనిష్ట కోతలతో అనేక చిత్రాలను ఆమోదించింది. అయితే ప్రభుత్వం 2021లో FCATని రద్దు చేసింది. RC కోతల జాబితాతో సంతృప్తి చెందకపోతే నిర్మాతకు ఇప్పుడు కోర్టుల తలుపులు తట్టడం తప్ప వేరే మార్గం లేదు.

కానీ అది సమయం తీసుకునే ప్రక్రియ. అయినప్పటికీ OMG2 ( ఓహ్ మై గాడ్ 2) కి ఎలాంటి కట్స్ లేకుండా RC ద్వారా ఆమోదం పొందాలి. ఈ సినిమా ఆగస్టు 11న సినిమా థియేటర్లలోకి రానుంది. OMG 2 లో అక్షయ్ కుమార్ శివుడిగా నటించారు. ఇందులో పంకజ్ త్రిపాఠి -యామీ గౌతమ్ తదితరులు నటించారు. ఇది సన్నీ డియోల్-అమీషా పటేల్ నటించిన గదర్ 2తో పోటీబరిలో నిలుస్తోంది.