Begin typing your search above and press return to search.

ఓం భీమ్ బుష్.. పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్టైనర్!

ట్రైలర్ కు వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ చూస్తుంటే ఓం భీమ్ బుష్ మూవీ పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్టైనర్ అవ్వనుందని సినీ పండితులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   17 March 2024 8:50 AM GMT
ఓం భీమ్ బుష్.. పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్టైనర్!
X

ఓం భీమ్ బుష్.. ఈ పదం వింటేనే సరదాగా అనిపిస్తోంది. ఇప్పుడు ఇదే పేరుతో త్వరలోనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. గతేడాది సామజవరగమనతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు.. మార్చి 22వ తేదీన ఓం భీమ్ బుష్ మూవీతో రానున్నారు. కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. గతంలో వీరు ముగ్గురు కలిసి బ్రోచేవారెవరురా సినిమాలో తమ కామెడీతో ఓ రేంజ్ లో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు.

ఇప్పుడు ఇదే ట్రియో మళ్లీ రిపీట్ అవ్వడంతో ఓం భీమ్ బుష్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త పాయింట్ తో హుషారు, రౌడీ బాయ్స్ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక మూవీ యూనిట్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వెరైటీగా ప్రమోషన్లు చేస్తూ అందరి చూపు తమ వైపు తిప్పుకుంటోంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. కచ్చితంగా ఈ థ్రిల్లర్ కామెడీ మూవీని చూడాల్సిందేనన్న హైప్ క్రియేట్ చేసింది. మరోసారి శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శి తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్ లో కడుపుబ్బా నవ్వించనున్నట్లు అర్ధమవుతోంది. హీరోయిన్లు ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్ గ్లామర్ డోస్ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ట్రైలర్ కు వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ చూస్తుంటే ఓం భీమ్ బుష్ మూవీ పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్టైనర్ అవ్వనుందని సినీ పండితులు చెబుతున్నారు. జాతి రత్నాలు సినిమా వైబ్స్ కనిపిస్తున్నాయని, అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ అని అంటున్నారు. ప్రమోషన్లకు యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని చెబుతున్నారు.

ఈ వారంలో మరో సరైన మూవీ లేదని, ఓం భీమ్ బుష్ హిలేరియస్ హిట్ పక్కా అంటున్నారు. అయితే ఓం భీమ్ బుష్ రిలీజైన రెండు వారాల తర్వాత ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది. పాజిటివ్ మౌత్ టాక్ వచ్చే చాలు.. శ్రీవిష్ణు మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో, సూపర్ హిట్ ట్రియో ఎలాంటి రిజల్ట్ సాధిస్తారో వేచి చూడాలి.