Begin typing your search above and press return to search.

ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్.. అస్సలు తగ్గట్లేదుగా..

బ్లాక్ బస్టర్ మూవీ బ్రోచేవారెవరురా తర్వాత మరోసారి శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్.

By:  Tupaki Desk   |   28 March 2024 9:50 AM GMT
ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్.. అస్సలు తగ్గట్లేదుగా..
X

బ్లాక్ బస్టర్ మూవీ బ్రోచేవారెవరురా తర్వాత మరోసారి శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీని వి.సెల్యులాయిడ్, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సమర్పించిన ఈ చిత్రం.. మార్చి 22వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.


అయితే మొదటి షోతోనే పాజిటివ్ టాక్ దక్కించుకుంది ఈ మూవీ. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అదరగొడుతోంది. ముఖ్యంగా అమెరికాలో మూవీ లవర్స్.. ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ హాఫ్ మిలియన్ మార్క్ కు చేరువలో ఉంది ఓం భీమ్ బుష్. చాలా రోజుల తర్వాత సినీ ప్రియులను కడుపుబ్బా నవ్విస్తుంది. బెస్ట్ సమ్మర్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచింది.

ఈ మూవీ.. థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా ఆరు రోజులు కంప్లీట్ చేసుకుంది. ఆరు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.20 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇంకా రేపు గుడ్ ఫ్రైడే కూడా కలిసి రానుంది. ఇప్పటికే అనేక చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. అతి త్వరలో ఓవరాల్ గా లాభాల్లోకి ప్రవేశించనున్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్ లో మరిన్ని వసూళ్లు వస్తాయని అంటున్నారు.

ఈ మూవీలో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారు. బ్రోచేవారెవరురా సినిమాను గుర్తు చేస్తున్నారు. ప్రీతి ముకుందన్, బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. సన్నీ ఎం ఆర్ సంగీతం అందించిన ఈ మూవీలో రచ్చ రవి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో.. త్వరలోనే స్ట్రీమింగ్ చేయనుంది.

స్టోరీ లైన్ ఇదే

ఓ యూనివ‌ర్సిటీకి చెందిన ముగ్గురు పీహెచ్‌ డీ విద్యార్థులు (శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ) చేసే ప‌నులు భ‌రించ‌లేక డాక్ట‌రేట్లు ఇచ్చి పంపించేస్తారు ప్రొఫెస‌ర్‌. ఆ తర్వాత వారు భైర‌వ‌పురం చేరుకుని సైంటిస్టుల్లా అవ‌తార‌మెత్తుతారు. ఎలాంటి స‌మ‌స్య‌ల‌కైనా ప‌రిష్కారం చూపిస్తామ‌ని ప్రచారం చేస్తారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడుతుంది. సంపంగి మ‌హ‌ల్‌ లో ఉన్న నిధిని క‌నిపెట్టి తీసుకొస్తే నిజ‌మైన సైంటిస్టులుగా న‌మ్ముతామ‌ని సర్పంచ్ చెప్పగా.. వారు ముగ్గురూ అందులోకి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి మీరు ఈ మూవీ చూశారా?