Begin typing your search above and press return to search.

ఓం భీమ్ బుష్ కలెక్షన్స్.. అంచనాలకు మించి..

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ పోషించిన ఓం భీమ్ బుష్ నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   23 March 2024 8:25 PM GMT
ఓం భీమ్ బుష్ కలెక్షన్స్.. అంచనాలకు మించి..
X

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఓ వైపు యాక్షన్ సినిమాలు, మరోవైపు కామెడీ చిత్రాలు చేసుకుంటూ వరుస హిట్లు కొడుతున్నారు. తాజాగా ఓం భీమ్ బుష్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో బ్రోచేవారెవరురా సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో నవ్వించిన శ్రీవిష్ణు.. మరోసారి కడుపుబ్బా సినీ ప్రియులను నవ్వించారు.


శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ పోషించిన ఓం భీమ్ బుష్ నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హుషారు, రౌడీ బాయ్స్ ఫేమ్ హర్ష కనుగొంటి దర్శకత్వం వహించిన ఈ మూవీని.. వి సెల్యులాయిడ్ తో కలిసి సునీల్ బలుసు నిర్మించారు. ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించగా.. ప్రియ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తోపాటు మరికొందరు ఇతర పాత్రలు పోషించారు.


విడుదలకు ముందే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూ అందుకుంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో డీసెంట్ టాక్ దక్కించుకుని దూసుకెళ్తోంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో తొలి రోజు భారీ వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. ఫస్ట్ షో, సెకండ్ షోకు తెలుగు రాష్ట్రాల్లోని చాలా సెంటర్లలో హౌస్‌ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.

తొలిరోజు.. ఏం భీమ్ బుష్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.4.6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అమెరికాలో 175 వేల డాలర్లకుపైగా రాబట్టినట్లు తెలిపారు. దీంతో ఆశించినదాని కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయని సినీ పండితులు చెబుతున్నారు. వీకెండ్స్ తోపాటు హోలీ సెలవు బాగా కలిసి వచ్చిందని, సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఓం భీమ్ బుష్ సినిమా బెస్ట్ సమ్మర్ ఎంటర్టైనర్ గా నిలిచింది. యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. కథతో సంబంధం లేకుండా కామెడీతో నవ్వించారు శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. ముందు నుంచి చెబుతున్నట్లు ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ఘోస్ట్ ఎపిసోడ్.. సినిమాకు ప్లస్ పాయింట్ అని అంటున్నారు ఆడియన్స్. మరి మీరు ఈ సినిమా చూశారా?