Begin typing your search above and press return to search.

ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్.. ఎంతవరకు వచ్చిందంటే..

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్.

By:  Tupaki Desk   |   27 March 2024 11:25 AM GMT
ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్.. ఎంతవరకు వచ్చిందంటే..
X

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. హుషారు ఫామ్ డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. రిలీజైన అన్ని సెంటర్లలో పాజిటివ్ హిట్ దక్కించుకుని దూసుకుపోతోంది. మంచి వసూళ్లు రాబడుతూ.. శ్రీ విష్ణు కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి క్రేజ్ ఇంకా పెంచింది.


రిలీజ్ కు ముందే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. బెస్ట్ సమ్మర్ కామెడీ ఎంటర్టైనర్ గా థియేటర్స్ లో అలరిస్తోంది. బ్రోచేవారెవరురా మూవీతో అలరించిన శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి.. మరోసారి ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నారు. చాలా రోజులకు మంచి కామెడీని మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.

మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ మూవీ.. రోజురోజుకూ వసూళ్లు పెంచుకుంటోంది. వీకెండ్, హోలీ ఫెస్టివల్ బాగా కలిసి వచ్చింది. ఈ వీకెండ్ కల్లా.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని క్లీన్ హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యూఎస్ లో కూడా ఈ మూవీ సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. 400K డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. హాఫ్ మిలియన్ మార్క్ కు చేరువలో ఉంది ఓం భీమ్ బుష్.

ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ.. 23.85 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. మరో స్ట్రాంగ్ వీకెండ్ దిశగా అడుగులు వేస్తోంది. గుడ్ ఫ్రైడే ఫెస్టివల్ కూడా కలిసి రానుంది. అనేక చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ మరింత ఎక్కువ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. వి. సెల్యూలాయిడ్, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పించింది.

ఈ చిత్రంలో నటి ప్రీతీ ముకుందన్, బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించారు. సన్నీ ఎం ఆర్ సంగీతం అందించిన ఈ సినిమాలో రచ్చ రవి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.