Begin typing your search above and press return to search.

ఓం భీమ్ బుష్ బ్యూటీ.. ఆమెకు అదే స్పెషల్ అట్రాక్షన్!

అయితే ముఖచిత్రం సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గెస్ట్ రోల్ లో నటించారు.

By:  Tupaki Desk   |   19 March 2024 11:30 PM GMT
ఓం భీమ్ బుష్ బ్యూటీ.. ఆమెకు అదే స్పెషల్ అట్రాక్షన్!
X

ఆయేషా ఖాన్.. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ పేరు బాగానే వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఆమె నటించిన తెలుగు సినిమా ఒక్కటే రిలీజ్ అయింది. అది కూడా ఇప్పుడు కాదు.. రెండేళ్ల క్రితం. ముఖచిత్రం మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ భామ. ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంది. సినిమా షూటింగ్ లో భాగంగా అప్పట్లో ప్రమాదానికి కూడా గురైంది. చాలా రోజుల తర్వాత ఆ విషయం బయటకొచ్చింది.


అయితే ముఖచిత్రం సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గెస్ట్ రోల్ లో నటించారు. మళ్లీ ఇప్పుడు ఆయన సినిమాతోనే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. విశ్వక్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో ఆయేషా ఖాన్ ఐటెం సాంగ్ చేసింది. ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్-17లో పాల్గొని కొద్దిరోజులకే హౌస్ నుంచి బయటకొచ్చేసింది. ఆ తర్వాత ఈ అమ్మడిని విశ్వక్ మూవీ మేకర్స్ తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చారు.

ఇక విశ్వక్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిందో లేదో.. ఆమెకు వరుస అవకాశాలు వచ్చేశాయి. త్వరలోనే ఆమె ఓం భీమ్ బుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తన అందంతో తెలుగు ప్రేక్షకులపై మంత్రం వేసేలా ఉంది ఈ బ్యూటీ. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా మార్చి 22వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీతో పాటు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ లో కీలక పాత్ర పోషించనుంది ఆయేష.

మరోవైపు, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ఆయేషా ఖాన్. చీరల్లో కూడా అందాలు ఆరబోయవచ్చని ప్రూవ్ చేస్తోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ లో కూడా సందడి చేస్తోంది. రీల్స్ లో సూపర్ గా డ్యాన్సులు వేస్తూ ఆకట్టుకుంటోంది. నడుము అందాలు చూపిస్తూ మాయ చేస్తుంటోంది. ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ను సంపాదించుకుంటోంది. డైలీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటోంది.

తాజాగా మెరూన్ కలర్ శారీలో ఆయేషా ఖాన్ కిర్రాక్ పోజిచ్చింది. చేతులు పైకెత్తి మరీ వయ్యారాలు ఒలకబోసింది. చీర కొంగు చాటులో నడుము చూపిస్తూ అల్లాడిస్తోంది. సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్.. ముఖ్యంగా ముక్కుపుడక ఆమెకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయేషా ఖాన్ గ్లామర్ కు అంతా ఫ్లాట్ అయిపోతున్నారు. మరి ఈ టాలీవుడ్ లక్కీ గర్ల్ ఫేట్ వరుస సినిమాలతో ఎలా మారుతుందో చూడాలి.