మరోసారి కవర్ చేసుకున్న ఆదిపురుష్ డైరెక్టర్
ఇదిలా ఉంటే రీసెంట్ గా జరిగిన వేవ్స్2025 సమ్మిట్ లో పాల్గొన్న ఓం రౌత్ ఆదిపురుష్ ఫ్లాప్ కాదని మరోసారి చెప్పే ప్రయత్నం చేశాడు.
By: Tupaki Desk | 3 May 2025 8:30 AMఇండస్ట్రీలో ప్రతీ వారం ఎన్నో సినిమాలు రిలీజవుతుంటాయి. అందులో ప్రతీ సినిమా హిట్ అవ్వాలని రూలేం లేదు. హీరోలు, బడ్జెట్ తో సంబంధం లేకుండా అన్నీ సినిమాలకు హిట్టూ, ఫ్లాపు సూత్రం వర్తిస్తుంటుంది. అయితే ఫ్లాపు సినిమాలను తీసినప్పుడు కొందరు దర్శకనిర్మాతలు హుందాగా తమ తప్పుని ఒప్పుకుంటూ ఉంటారు.
కానీ కొందరు మాత్రం తాము తీసింది ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి అసలు ఇష్టపడరు. ఏదొక కారణంతో తాము మంచి సినిమా తీశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి డైరెక్టర్లలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ కూడా ఒకరు. ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ ఎంత పెద్ద ఫ్లాప్ అనేది అందరికీ తెలిసిందే.
ఆదిపురుష్ రిలీజ్ టైమ్ లో ఎంతోమంది ఆ సినిమాను ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఓం రౌత్ రామాయణంను అంత నాసిరకంగా తెరకెక్కిస్తాడని అసలెవరూ ఊహించలేదు. ఆయన తీసిన ఆదిపురుష్ ఫ్లాప్ అవడం వల్లే ఇప్పుడు బాలీవుడ్ లో నితీష్ తివారీ రణ్‌బీర్ కపూర్ తో రామాయణంను మళ్లీ తెరకెక్కిస్తున్నాడు. నిజంగా ఓం రౌత్ మంచి సినిమాను తీసి ఉంటే నితీష్ మరోసారి ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉండేది కాదనేది వాస్తవం.
ఇదిలా ఉంటే రీసెంట్ గా జరిగిన వేవ్స్2025 సమ్మిట్ లో పాల్గొన్న ఓం రౌత్ ఆదిపురుష్ ఫ్లాప్ కాదని మరోసారి చెప్పే ప్రయత్నం చేశాడు. ఆదిపురుష్ తెలుగు రైట్స్ రూ.120 కోట్లకు అమ్ముడయ్యాయని, అంత రేటు పెట్టి కొన్నారంటే ఎక్కువమంది ఆడియన్స్ ఆ సినిమాను చూశారనేకదా అని, ఎప్పుడైనా ఓ మేకర్ ఎక్కువగా రీచ్ తెచ్చుకోవాలని చూస్తాడని, ఆ రకంగా తన టార్గెట్ రీచ్ అయినట్టేనని కవర్ చేసుకున్నాడు ఓం రౌత్.
ఓం రౌత్ చెప్పిన మాటలు విన్నాక ప్రభాస్ ఫ్యాన్స్ కు అసలేం మాట్లాడాలనేది కూడా అర్థం కావడం లేదు. రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాను తన కొడుక్కి చూపించాక సారీ చెప్పానని అందులో రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ చేశాడు. అయినా సరే ఓం రౌత్ ఆదిపురుష్ ను అంతలా వెనుకేసుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తన తప్పుని ఒప్పుకుంటే ఎంతో హుందాగా ఉండేదని, అలా కాకుండా ఓం రౌత్ ఇలా కవర్ చేసుకోవడం ఏ మాత్రం బాలేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఓం రౌత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.