గర్భిణి అయిన భార్యకు నటుడు విడాకులు
పాపులర్ నటుడు గర్భవతిగా ఉన్న తన భార్యను విడిచిపెట్టాడు. తాను వేరొక యువతిని ప్రేమిస్తున్నానని భార్యకు చెప్పాడు.
By: Tupaki Desk | 11 April 2025 9:07 AM ISTపాపులర్ నటుడు గర్భవతిగా ఉన్న తన భార్యను విడిచిపెట్టాడు. తాను వేరొక యువతిని ప్రేమిస్తున్నానని భార్యకు చెప్పాడు. ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా మారాయి. భార్యా భర్తల పంచాయితీ కోర్టుకు చేరుకుంది. విడాకుల వరకూ వెళ్లింది. అంతేకాదు.. కోర్టులో 5లక్షల భరణం చెల్లించేందుకు అంగీకరించాడు. అతడు మొదట 25000 తన కార్యదర్శి ద్వారా ఆమెకు పంపాడు. కానీ ఆమె తిరస్కరించింది. అంతేకాదు తన బిడ్డ చనిపోయిన ఆవేదనను తన మనసులోనే దాచుకుంది ఆ భార్య. ఈ ఎపిసోడ్ ఏ నటుడి జీవితంలో ఎదురైంది? అని ప్రశ్నిస్తే.. కచ్ఛితంగా పాపులర్ హిందీ నటుడు, దివంగత ఓంపురి గురించిన కథే ఇది.
మొదటి భార్య తనను ఓంపురి మోసం చేసాడని బహిరంగంగా వాపోయారు. వారి మధ్య బ్యాటిల్ పై ఇండస్ట్రీలో చాలా చర్చ సాగింది. అతడి అసహ్యకరమైన ప్రవర్తన గురించి ఆమె పదే పదే బహిరంగంగా వెల్లడించింది.
దివంగత నటుడు ఓం పురి మొదటి భార్య సీమా కపూర్, తమ వివాహ వైఫల్యం గురించి మాట్లాడుతూ.. తమ మధ్య మరొక మహిళ ఉందని తెలిపారు. అతడు మరొక మహిళతో సంబంధం పెట్టుకున్న తర్వాత విడిపోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆ సమయంలో తాను గర్భవతిని అని, ఒక దశ తర్వాత, ఆ ద్రోహం తనకు భరించలేనంతగా మారిందని సీమా చెప్పారు. అతడిని విడిచి ఆమె వెళ్లిపోయింది.. కానీ వారి బిడ్డ బతకలేదు.. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో సీమా వెల్లడించారు. ఓం పురి తనకు కార్యదర్శి ద్వారా రూ.25,000 పరిహారంగా పంపాడని, కానీ అది తీసుకునేందుకు నిరాకరించానని తెలిపారు.
జర్నలిస్ట్ నందితతో ప్రేమలో పడ్డానని అతడు తనతో చెప్పాడు. ఆ తర్వాత పరిస్థితులు ఎంత అసహ్యంగా మారాయో కూడా సీమా గుర్తుచేసుకున్నారు. అతడు ఆమెను వివాహం చేసుకుని ఒక కొడుకును కనాలని అనుకున్నారని తెలిపారు. హాలీవుడ్ చిత్రం `సిటీ ఆఫ్ జాయ్`లో పనిచేస్తున్నప్పుడు ఓం నందితను ఓంపురి కలిశారని గుర్తు చేసుకున్నారు. మా వివాహం తర్వాత అంతా బాగానే ఉంది కానీ ఆ సినిమా నా జీవితాన్ని తలకిందులు చేసింది... నా బెస్ట్ ఫ్రెండ్ రేణు సలుజ(విధు వినోద్ మొదటి భార్య)కు ఆ వ్యవహారం గురించి తెలుసు. కానీ కొందరు కలిసి ఈ గొడవను ఒక దశకు తగ్గించారు. ఆ సినిమా తర్వాత అతడు సాధారణ స్థితికి వస్తాడని వారు భావించారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా కాలం తర్వాత ఆ వ్యవహారం గురించి తెలుసుకున్నాను. అతడు నాకు ఫోన్ చేసి, తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పాడు.
ఓంపురి విడాకులు కావాలని కోరగా, తన చెవులను తాను నమ్మలేకపోయానని సీమా చెప్పారు. నేను ముంబైకి తిరిగి వచ్చాను.. అంతా సాధారణంగానే అనిపించింది. ఆ తర్వాత అతడు షూటింగ్ కోసం నగరం నుండి బయలుదేరాడు.. అతని వస్తువులను వెతుకుతున్నప్పుడు నాకు ప్రేమలేఖలు కనిపించాయి. నేను బాధపడ్డాను. ఈ వ్యవహారం ఎలా ఉన్నా నేను అతనికి విడాకులు ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. గర్భవతిని కాబట్టి నేను పరిస్థితిని చక్కదిద్దాలనుకున్నాను. నేను గర్భవతినని అతనికి తెలుసు.. కానీ ఇది నందితలో అభద్రతను పెంచింది. ఆమె నా ముందే అతనికి ఫోన్ చేసేది! అని చెప్పింది.
తాను ఘర్షణ పడే తత్వం లేని వ్యక్తినని సీమా చెప్పింది. కానీ ఓం తన నుండి విడిపోవడానికి ఒక సాకు వెతికాడు. తన నమ్మకద్రోహాలను ఒప్పుకున్నా కానీ, ఏదో ఒక షాకుతో అతడు నాపై పోరాడాడు. కానీ పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. ఓం పూరి సాహబ్ ఎక్కువగా తాగేవాడు. నందిత ఒక సీన్ క్రియేట్ చేసేది. ఒక రాత్రి నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నేను మూడు నెలల గర్భవతిని. కానీ నా సోదరుడు, నటుడు అన్ను కపూర్ జరిగిన దానిపై కోపంగా ఉన్నాడు. ఓం పూరిని కోర్టులో హాజరుపరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. సీమా అతడి నుండి రూ.6 లక్షలు భరణంగా పొందింది. కానీ బిడ్డ చనిపోవడంతో అతడు పంపిన రూ.25,000 ను తిరస్కరించింది.
నన్ను ఓదార్చడం మర్చిపోయిన ఓంపురి తన కార్యదర్శి ద్వారా రూ.25,000 పంపాడు. నేను దానిని తిరస్కరించాను. అతడి కార్యదర్శి నాకు, `ఈ అహంకారమే నిన్ను నాశనం చేస్తోంది` అని చెప్పింది. కానీ అతడు అహంకారంగా భావించేది కేవలం ఆత్మగౌరవం మాత్రమే. తన చివరి సంవత్సరాల్లో తాను ఓం పురి తిరిగి కలిశామని సీమా చెప్పింది. ఆ సమయంలో అతడు అకస్మాత్తుగా ఆమెకు ఫోన్ చేసి తాను చేసిన ప్రతిదానికీ క్షమాపణ చెప్పాడు.
