Begin typing your search above and press return to search.

నితిన్ తో శ్రీలీల ఎక్స్ ట్రా.. మాస్ రచ్చ!

తీన్ మార్ బ్యాండ్ మోత తో హరిస్ జయరాజ్ మాస్ ఆడియన్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చాడు అనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 7:35 AM GMT
నితిన్ తో శ్రీలీల ఎక్స్ ట్రా.. మాస్ రచ్చ!
X

నితిన్ శ్రీలీల మొదటిసారి కలిసిన కలిసి నటించిన చిత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ట్రైలర్ రెండు కూడా సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక సాంగ్స్ కూడా సినిమాకు హైప్ పెంచడంలో చాలా హెల్ప్ అవుతున్నాయి. హరీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి మరొక పాటను విడుదల చేశారు.


నితిన్ అనగానే అందరికీ కూడా మాస్ డాన్స్ ఎక్కువగా గుర్తుకువస్తుంది. అలాగే శ్రీలీల కూడా ఇప్పటికే తన మాస్ స్టెప్పులతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈసారి కూడా ఇద్దరి కాంబినేషన్లో ఎక్స్ ట్రా మాస్ రచ్చను చూపించారు. ఓలే ఓలే పాపాయి అనే ఈ పాటను విడుదల చేయగా అందులో నితిన్ అలాగే శ్రీలలా ఇద్దరు కూడా వారి డ్రెస్సింగ్ స్టైల్ తో మాత్రమే కాకుండా మాస్ స్టెప్పులతో కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు.

తీన్ మార్ బ్యాండ్ మోత తో హరిస్ జయరాజ్ మాస్ ఆడియన్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చాడు అనిపిస్తోంది. ఇక రామ్ మిర్యాల గానం కాసర్ల శ్యామ్ లిరిక్స్ కూడా ఈ పాటకు మరింత బూస్ట్ ఇచ్చాయి. ముఖ్యంగా నితిన్ శ్రీలీల ఇద్దరు కూడా ఒకవైపు స్టైలిష్ గా కనిపిస్తూనే మరొకవైపు మాస్ డ్రెస్సింగ్ స్టైల్ తో కూడా ఎంతగానో అట్రాక్ట్ చేశారు.

చూస్తూ ఉంటే సినిమాలో ఈ సాంగ్ విజిల్స్ వేయించేలా ఉందని అనిపిస్తోంది. ఇక ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాకు టాలీవుడ్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు. కిక్ రేసుగుర్రం టెంపర్ లాంటి సినిమాలకు కథలను అందించిన వక్కంతం వంశీ ఇదివరకే దర్శకుడిగా అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమా చేశాడు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు.

దీంతో ఇప్పుడు ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకొని ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు. నితిన్ కూడా ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.