Begin typing your search above and press return to search.

'ఓ మై గాడ్' ఇన్ని ఇబ్బందులా?

అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఓ మై గాడ్ 2 సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   2 Aug 2023 5:19 AM GMT
ఓ మై గాడ్ ఇన్ని ఇబ్బందులా?
X

అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఓ మై గాడ్ 2 సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కోసం హిందీ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ సోషల్ మీడియా సందడి చూస్తే అర్థం అవుతుంది.

ఓ మై గాడ్‌ 2 సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 11న విడుదల కాబోతుంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఏకంగా 25 కట్స్ చెప్పడంతో పాటు చాలా చోట్ల డైలాగ్స్ ను మ్యూట్‌ చేయడం ఇంకా పలు మార్పులు సూచించడం వంటివి చేశారట. ఒకానొక సమయంలో ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ రావడం అనుమానమే అన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.

ఆదిపురుష్ సినిమాకు ఈజీగానే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అయితే తమ అభ్యంతరాలపై కోర్టుకు కొందరు వెళ్లడంతో సెన్సార్‌ బోర్డ్‌ తీరును కోర్టు తప్పుబట్టిన విషయం తెల్సిందే. అంతగా వివాదం జరుగుతున్న కారణంగా ఓ మై గాడ్ 2 సినిమా సెన్సార్‌ కి కాస్త ఎక్కువ సమయం పట్టింది.. కాస్త ఎక్కువ రిస్క్ కూడా అయింది.

మొదట సెన్సార్‌ చేసిన బృందం రివ్యూ కమిటీకి పంపించింది. అక్కడ రివ్యూ చేసి సెన్సార్‌ చేసిన సభ్యులు భారీ ఎత్తున కట్స్ చెప్పారు.. పలు డైలాగ్స్ పై అభ్యంతరం చెప్పారు. అదే సమయంలో సినిమా లో అక్షయ్ కుమార్‌ ను దేవుడిగా కాకుండా దేవ దూత మాదిరిగా చూపిస్తేనే సెన్సార్‌ క్లీయరెన్స్ ఇస్తాం అన్నట్లుగా సెన్సార్‌ వారు కండీషన్ పెట్టారు అన్నట్లుగా ప్రచారం జరిగింది.

ఓ మై గాడ్‌ 2 సినిమాకి సెన్సార్‌ కి కాస్త ఇబ్బంది అయిన మాట వాస్తవం. ఫైనల్ గా సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించాడు.

సెన్సార్‌ బోర్డ్‌ వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని సెన్సార్‌ చేసినా కూడా కొందరు వివాదం రాజేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓ మై గాడ్‌ 2 సినిమా విషయం లో ఇప్పటి నుంచి కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. విడుదల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో... మొత్తానికి చిత్ర యూనిట్‌ సభ్యులు ఓ మై గాడ్ ఇన్ని ఇబ్బందులు ఏంటో అని నిట్టూరుస్తూ ఉంటారు.