Begin typing your search above and press return to search.

ఫారియా మేడమ్ ప్రేమలో.. అల్లరి హీరో!

ఇక సీరియస్ సినిమాల అనంతరం అల్లరి నరేష్ మళ్ళీ తన కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు.

By:  Tupaki Desk   |   6 March 2024 4:43 AM GMT
ఫారియా మేడమ్ ప్రేమలో.. అల్లరి హీరో!
X

అల్లరి నరేష్ కామెడీ సినిమాలతోనే ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇక ఆ తరువాత మెల్లగా ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ నటుడిగా మరిన్ని షేడ్స్ చూపించాడు. ముఖ్యంగా నాంది సినిమా అతనికి మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. ఉగ్రం సినిమాలో కూడా నరేష్ కొత్తగా కనిపించాడు. ఇక సీరియస్ సినిమాల అనంతరం అల్లరి నరేష్ మళ్ళీ తన కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు.


నూతన దర్శకుడు మల్లి అంకంతో చేస్తున్న చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఇక నరేష్ కు జోడిగా జాతిరత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. ఇక మేకర్స్ ఇటీవల సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ను ప్రారంభించారు.

అల్లరి నరేష్ మరియు ఫరియా అబ్దుల్లా కాంబినేషన్ లో ఉన్న ఫస్ట్ సింగిల్ 'ఓహ్ మేడమ్‌'ను విడుదల చేశారు. సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ పాటను లాంచ్ చేశారు. హృదయంతో మాట్లాడే ఈ మెలోడీతో ప్రేమను అనుభూతి చెందండి అంటూ మేకర్స్ మంచి కొటేషన్ తో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక వినసొంపుగా ఉండేలా ప్రేమ పాటలను అందించడంలో స్పెషలిస్ట్ అయిన గోపీ సుందర్ ఈ ఎనర్జిటిక్ మెలోడీని అందించాడు.

ప్రేమ కోసం కథానాయకుడి భావాలను సరిగ్గా వ్యక్తం చేసేలా భాస్కరభట్ల రచన అందించారు. ఇక సింగర్ అనురాగ్ కులకర్ణి తన ఆహ్లాదకరమైన గాత్రంతో మరోసారి మ్యాజిక్ చేశాడు. మొత్తానికి పాట వినగానే కనెక్ట్ అయ్యేలా ఉందనిపిస్తోంది. ఇక లిరికల్ వీడియోలో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లాల ఇద్దరు కూడా అద్భుతమైన కెమిస్ట్రీతో ఆకట్టుకునే విధంగా ఉన్నారు.

అల్లరి నరేష్ ఆమెతో సరసాలాడుతుండగా, ఆమె అతని సహవాసాన్ని ఆనందిస్తుంది. విజువల్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. చూస్తుంటే ఈ ఇద్దరు బిగ్ స్క్రీన్ పై వారి అల్లరి ప్రేమతో మ్యాజిక్ క్రియేట్ చేసేలా ఉన్నారు. ఇక సినిమాలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, మరియు అరియానా గ్లోరీ ఇతర పాత్రలలో కనిపించబోతున్నారు. మేకర్స్ ముందుగా చెప్పినట్లుగానే ఆ ఒక్కటి అడక్కు సినిమాను మార్చి 22 థియేట్రికల్ గా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.