సుహాస్ 'ఓ భామ అయ్యో రామ'.. బ్యూటిఫుల్ ట్రైలర్ చూశారా?
ఓ భామ అయ్యో రామ మూవీతోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు
By: Tupaki Desk | 5 July 2025 4:46 PM ISTవిభిన్నమైన, వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకోవడంలో పేరుగాంచిన యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సుహాస్.. ఇప్పుడు కొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓ భామ అయ్యో రామ మూవీతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాలీవుడ్ మూవీ జో లో తన రోల్ తో క్రేజ్ సంపాదించుకున్న మాళవిక మనోజ్.. సుహాస్ సరసన నటిస్తున్నారు.
ఓ భామ అయ్యో రామ మూవీతోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకులు మారుతి, హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. స్పిరిట్ మీడియా బ్యానర్ పై రానా దగ్గుబాటి.. సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసిన మేకర్స్.. ప్రస్తుతం ప్రమోషన్స్ చేపడుతున్నారు. వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. ఆడియన్స్ ను మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రైలర్.. అందరినీ ఆకట్టుకుని సందడి చేస్తోంది.
ట్రైలర్ బట్టి.. ఓ భామ అయ్యో రామ క్యూట్ అండ్ ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీలా సినిమా ఉండనున్నట్లు అర్థమవుతుంది. ఎంటర్టైన్మెంట్ తోపాటు ఎమోషన్, హీరో, హీరోయిన్స్ ఎనర్జీ.. అలా ప్రజెంట్ జెనరేషన్ ఆడియన్స్ తోపాటు అన్ని వర్గాల సినిమాను అలరించనున్నట్లు ఓ భామ అయ్యో రామ రూపొందిస్తున్నారని తెలుస్తుంది.
ముఖ్యంగా ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా ఉందని చెప్పాలి. హీరోహీరోయిన్ల మధ్య సీన్స్ బాగున్నాయి. సుహాస్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. రామ్ గోధల సినిమా కోసం బాగా కష్ట పడినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ట్రైలర్.. మూవీపై అంచనాలు పెంచుతోంది.
అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత నిర్మాత హరీష్ మాట్లాడారు. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటలకే మంచి స్పందన వచ్చిందని, చాలామంది సినిమా విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నారని తెలిపారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ లోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నిమగ్నం చేసేలా రూపొందించామని చెప్పారు.
ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన సానుకూల స్పందన వచ్చిందని దర్శకుడు రామ్ పేర్కొన్నారు. నిర్మాణంలో ఏ దశలోనూ నాణ్యత విషయంలో రాజీ పడలేదని నిర్మాతను ప్రశంసించారు. హరీష్ మద్దతు వల్లే తాము ఇంత నాణ్యమైన ఉత్పత్తిని నిర్మించగలిగామని తెలిపారు. మరి ఎలాంటి హిట్ సాధిస్తారో వేచి చూడాలి.