Begin typing your search above and press return to search.

OG థియేట్రికల్ బిజినెస్.. ఆ రేంజ్ లో ఆశలు

ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పటి నుంచి బిజినెస్ ప్లాన్ లో నిర్మాత డివివి దానయ్య ఉన్నారంట.

By:  Tupaki Desk   |   8 Aug 2023 4:10 AM GMT
OG థియేట్రికల్ బిజినెస్.. ఆ రేంజ్ లో ఆశలు
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఓజీ. ఈ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే కీలకమైన ఎపిసోడ్స్ ని సుజిత్ కంప్లీట్ చేసేశారు. ప్రియాంకా ఆరుళ్ మోహన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హస్మీ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. అమితాబచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లాంటి ప్రామిసింగ్ యాక్టర్స్ మూవీలో నటిస్తున్నారు.

డివివి దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దీనిని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి ముందుగా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే యాత్ర ప్రారంభం అయిన తర్వాత గ్యాప్ వచ్చింది. ఓ 30 రోజులు పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఇస్తే అతనికి సంబందించిన సీక్వెన్స్ అన్ని కంప్లీట్ చేయడానికి సుజిత్ సిద్ధంగా ఉన్నారు. వారాహి యాత్ర మూడో విడత తర్వాత కొన్ని రోజులు డేట్స్ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పటి నుంచి బిజినెస్ ప్లాన్ లో నిర్మాత డివివి దానయ్య ఉన్నారంట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే కచ్చితంగా డిస్టిబ్యూటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. దానికి తోడు ఇది పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. సుజిత్ సాహో తర్వాత చేస్తోన్న మూవీ కావడంతో అతనికి పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ఉంటుంది. సాహో తర్వాత వస్తోన్న సినిమాగా ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉంటాయి.

సాహో సినిమా తెలుగులో ఆశించిన సక్సెస్ కాకపోయిన హిందీలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఓజీ మూవీపై 140 నుంచి 150 కోట్ల వరకు బిజినెస్ చేయాలని దానయ్య ప్లాన్ చేసుకుంటున్నారంట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటి వరకు 100 నుంచి 120 కోట్ల మధ్య బిజినెస్ చేస్తున్నాయి. ఓజీ మూవీ నిర్మాత దానయ్య అనుకున్నట్లు జరిగితే రికార్డు అని చెప్పాలి.

ఎవరేజ్ స్టోరికి కూడా తన మేకింగ్ తో అద్భుతంగా ప్రెజెంట్ చేయడం సుజిత్ గొప్పతనం. అలాంటిది ఓజీ మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడిచే కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ కథతో చేస్తోన్నారు. అలాగే క్యాస్టింగ్ కూడా గట్టిగానే పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో మోస్ట్ స్టైలిష్ మూవీగా దీనిని ప్రెజెంట్ చేసే ప్రయత్నం సుజిత్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ లుక్, టీజర్ వస్తే సినిమాపై డివివి ఎక్స్ పెక్ట్ చేసే బిజినెస్ జరుగుతుందా లేదా అనేది తెలిసిపోతుంది.