Begin typing your search above and press return to search.

OG న్యూ టార్గెట్.. ఒకే ఒక్క ఆశ

ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా ఫిక్స్ చేసుకుందట. వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

By:  Tupaki Desk   |   20 Dec 2023 12:30 PM GMT
OG న్యూ టార్గెట్.. ఒకే ఒక్క ఆశ
X

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై పూర్తి దృష్టి సారించారు. సినిమా షూటింగ్లకు దూరంగా ఉంటున్నారు. వరుస ప్రాజెక్ట్లు చేతిలో ఉన్నా అన్నింటికీ బ్రేక్ ఇచ్చేసి ఏపీ రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ఓజీ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వకీల్సాబ్ మూవీతో గ్రేట్ కమ్బ్యాక్ ఇచ్చారు పవన్. ఆ తర్వాత భీమ్లానాయక్, బ్రో సినిమాలో ప్రేకక్షులను పలకరించారు. కానీ ఈ సినిమాలు కమర్షియల్గా పవన్కు నిరాశ మిగిల్చాయి. బ్రో సినిమా కన్నా ముందే పవన్.. హరిహర వీరముల్లు సినిమాను ప్రారంభించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనా.. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు.

హరిహర వీరమల్లు కాకుండా పవన్ చేతిలో OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. అయితే యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఓజీ మూవీ.. మాఫియా బ్యాక్ డ్రాప్తో రూపుందుతోంది. కొన్ని నెలల క్రితం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ను ముంబయిలో ప్రారంభించారు మేకర్స్. పవన్ సహా పలువురు సినీ ప్రముఖులపై కీలకమైన సీన్స్ షూట్ చేశారు. ఓ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు.

అయితే ఓజీ సినిమాకు సంబంధించి మిగిలిన షూటింగ్ పార్ట్ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసిందట. ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా ఫిక్స్ చేసుకుందట. వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.

వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల జరగనున్నాయి. దీంతో అప్పటి వరకు ఓజీ షూటింగ్లో పాల్గొనలేనని పవన్ చెప్పేశారట. మే నెల తర్వాతే షూటింగ్లో పాల్గొంటానని క్లారిటీ ఇచ్చారట. అందుకే ఈ మూవీ దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అయితే ఈ మూవీపై పవన్ భారీ ఆశలు పెట్టుకున్నారు. బిగ్ హిట్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. మిగతా రెండు సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు కనుక ఈ సినిమాతోనే హిట్ కొట్టాలని చూస్తున్నారట.

ఓజీ సినిమా విషయానికొస్తే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన అప్డేట్లతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.