Begin typing your search above and press return to search.

'ఓజీ' ఆ ప‌నుల్లో బిజీ అయ్యారా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ గా బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. 2024 లో జ‌రిగే ఎన్నికలు పూర్త‌య్యే వ‌ర‌కూ పీకే మ‌ళ్లీ సినిమాల జోలికి వ‌చ్చేది లేదు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 3:00 AM GMT
ఓజీ ఆ ప‌నుల్లో బిజీ అయ్యారా?
X

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ గా బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. 2024 లో జ‌రిగే ఎన్నికలు పూర్త‌య్యే వ‌ర‌కూ పీకే మ‌ళ్లీ సినిమాల జోలికి వ‌చ్చేది లేదు. అందుకే పీకే తో క‌మిట్ అయిన ద‌ర్శ‌కులంతా కొత్త ప్రాజెక్ట్ లు సెట్ చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ ఓ స్టార్ హీరోయిన్ తో లేడీ ఓరియేంటెడ్ చిత్రం ప్లాన్ చేసుకుంటున్నారు. హ‌రీష్ శంక‌ర్ మాస్ రాజా ర‌వితేజ తో `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్` మొద‌లు పెట్టారు.

మ‌రి యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ఏం చేస్తున్న‌ట్లు? అంటే ఆయ‌న మాత్రం `ఓజీ` ప‌నుల్లోనే బిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఎంత‌వ‌ర‌కూ షూటింగ్ పార్టు పూర్త‌యిందో అంత‌వ‌ర‌కూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసే ప‌నిలో నిమ‌గ్న‌మైన‌ట్లు వినిపిస్తుంది. సినిమాకి సీజీ వ‌ర్క్ కూడా ఎక్కువ‌గా ఉండ‌టంతోనే సుజిత్ ఈ నిర్ణ‌యం తీసుకుని ఖాళీ స‌మ‌యాన్ని ఇలా పుల్ ఫిల్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ముంబై బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీ అన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో పీకే ని కొత్త‌గా స్టైలిష్ గా చూపించ‌బోతున్నాడు. అందుకోసం ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ‌క ముందే చాలా వ‌ర్క్ చేసాడు. షూట్ మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి మ‌రింత బిజీ అయ్యాడు. ఇప్పుడు ఖాళీ స‌మ‌యాన్ని వృద్ధా చేయ‌కుండా ...కొత్త సినిమా అంటూ డైవ‌ర్ట్ కాకుండా ఓజీ కోస‌మే ప‌నిచేయ‌డం విశేషం.

ఇక పీకే `ఓజీ` సెట్స్ కి ఎప్పుడు తిరిగి వ‌స్తారు? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం. మ‌రో ఐదారు నెల‌లైనా స‌మ‌యం ప‌ట్టొచ్చు. ఈలోపు ఓజీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ అయినంత వ‌ర‌కూ పూర్తి చేస్తాడు సుజిత్. అటుపై పీకే జాయిన్ అయిన త‌ర్వాత మ‌ళ్లీ య‌ధావిధిగా సెట్స్ కి వెళ్తారు. కొత్త‌గా సుజిత్ మ‌రో ప్రాజెక్ట్ అంటూ ముందుకెళ్ల‌డానికి కూడా స‌మ‌యం స‌రిపోదు. ఎందుకంటే పీకే ముందుగా ఓజీ షూటింగ్ నే పూర్తి చేసే అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి ఛాన్స్ తీసుకోక‌పోవ‌చ్చు.