Begin typing your search above and press return to search.

పవన్ మూవీస్.. ఇప్పుడు మరో అప్డేట్ రెడీ!

అయితే మార్చి 24న ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజు. కాబట్టి మేకర్స్ ఆ రోజు గ్లింప్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

By:  Tupaki Desk   |   17 March 2024 8:49 AM GMT
పవన్ మూవీస్.. ఇప్పుడు మరో అప్డేట్ రెడీ!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ సినిమాలు.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్.. వరుస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ సినీ పరిశ్రమలో మాత్రం ఆయన నటిస్తున్న సినిమాల గురించే చర్చ నడుస్తోంది. పవన్ మళ్లీ సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడతారనేది ఎవరూ చెప్పలేం. కానీ అంతా పవన్ మూవీల కోసమే మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం పవన్ చేతి నిండా సినిమాలు ఉండగా.. అన్ని చిత్రాల షూటింగ్స్ కు బ్రేకులు పడ్డాయి. మళ్లీ పొలిటికల్ హీట్ తగ్గిన తర్వాత అవి పూర్తవ్వనున్నాయి. అయితే పవన్ నటిస్తున్న సినిమాల్లో ఒకటైన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీజర్.. త్వరలోనే విడుదల కానుంది. మేకర్స్ కూడా ఇటీవల ఇన్ డైరెక్ట్ గా ఇదే విషయాన్ని చెప్పారు. ఇక ఇప్పుడు త్వరలోనే ఓజీ మూవీ గ్లింప్స్ కూడా రానుందట.

ముంబయి బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీ మూవీని సాహో ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై అటు ఫ్యాన్స్ తోపాటు ఇటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విలన్ గా బీ టౌన్ హీరో ఇమ్రాన్ హష్మీ కనిపించనున్న విషయం తెలిసిందే.

తాజాగా ఆయన సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఆ సందర్భంగా ఓ నెటిజన్.. ఓజీ మూవీతో పాటు తన రోల్ గురించి చెప్పమని కోరారు. అందుకు సమాధానంగా ఇమ్రాన్.. ఇప్పుడు నేనేం చెప్పలేను, కానీ గ్లింప్స్ త్వరలోనే రాబోతోందని చెప్పారు. దీంతో ఆయన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అయితే మార్చి 24న ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజు. కాబట్టి మేకర్స్ ఆ రోజు గ్లింప్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ ను ఆ గ్లింప్స్ లో ఓజీ మేకర్స్ రివీల్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి అందులో కేవలం ఇమ్రానేనా, లేక పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇటీవల తమన్ కూడా పవన్ మాసివ్ పోస్టర్ ను షేర్ చేశారు. అయితే ఒకేసారి ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ అప్డేట్స్ రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెయిటింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.