Begin typing your search above and press return to search.

OG: సాహో మిస్టేక్ రిపీట్ కాకుండా.. స్ట్రాంగ్ పాయింట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో OG సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Jan 2024 10:30 AM GMT
OG: సాహో మిస్టేక్ రిపీట్ కాకుండా.. స్ట్రాంగ్ పాయింట్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో OG సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేస్తోన్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఎన్నికల తర్వాత మరల రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.

అయితే ఈ లోపే సుజిత్ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారంట. ఫిబ్రవరి లో OG మూవీ న్యూ షెడ్యూల్ ని షూటింగ్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం అయితే లేదు. ఫిబ్రవరి నుంచి పవన్ కళ్యాణ్ జిల్లాల విస్తృత పర్యటనలు ఉన్నాయి. అలాగే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

అతని ఫోకస్ మొత్తం ఎన్నికలపైనే ఉంది. ఒక OG మూవీ లేటెస్ట్ విషయానికి వస్తే ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని సుజిత్ డిజైన్ చేశాడంట. అలాగే మూవీ ఎమోషనల్ బ్లాక్స్ కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. సాహో సినిమాలో సుజిత్ యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా ఆవిష్కరించారు. అయితే మూవీలో ఎమోషన్ మిస్ అయ్యిందనే టాక్ వచ్చింది.

ఎమోషన్ లో యాక్షన్ క్లిక్ అయితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాలలో కూడా ఎమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యి బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ఈ నేపథ్యంలో సుజీత్ OG కోసం కేవలం యాక్షన్ బ్లాక్స్ మాత్రమే కాకుండా హార్ట్ టచింగ్ హ్యూమన్ ఎమోషన్స్ ను సినిమాలో హైలెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఊచకోత కోయడమే కాకుండా మంచి వారితో సున్నితమైన మానవత్వం కలిగి ఉంటుందంట.

ఈ మూవీలో నటిస్తోన్న శ్రియా రెడ్డి కూడా అద్భుతమైన స్క్రిప్ట్ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్తగా ఉంటుందని చెప్పారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ కి OGతో ఒక సాలిడ్ సక్సెస్ ని అయితే సుజిత్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.