Begin typing your search above and press return to search.

'ఓజీ'.. ఇది మరో కిక్కిచ్చే లీక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న పాన్ ఇండియా మూవీ ఓజీ.

By:  Tupaki Desk   |   1 April 2024 4:01 AM GMT
ఓజీ.. ఇది మరో కిక్కిచ్చే లీక్!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న పాన్ ఇండియా మూవీ ఓజీ. ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. పవన్ కళ్యాణ్ మరో 15 రోజులు డేట్స్ కేటాయిస్తే మిగిలిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుందంట. ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ మరల ఓజీ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.

ఈ లెక్కన చూసుకుంటే జూన్ లేదా జులై నెలల్లో తిరిగి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావొచ్చని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుజిత్ ఇప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ కావడంతో ఓజీ మూవీపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. పవర్ స్టార్ అభిమానులు కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

కచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో బెస్ట్ మూవీగా ఓజీ ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో బజ్ క్రియేట్ అవుతూనే ఉంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. తప్పకుండా నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందని టాక్.

పవన్ కళ్యాణ్ ఒక లీడర్ గా, గ్యాంగ్ స్టార్ గా, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా, పీపుల్స్ చాంపియన్ గా కనిపిస్తాడంట. కథనం ప్రకారం పవన్ కళ్యాణ్ తన ఐడెంటిటీని మార్చుకునే క్రమంలో ఈ రకమైన షేడ్స్ లో కనిపిస్తాడనే ప్రచారం నడుస్తోంది. ఓ వైపు గన్నులతో బీభత్సం క్రియేట్ చేస్తూనే మరోవైపు మార్షల్ ఆర్ట్ తో కూడా పవన్ ఆకట్టుకుంటాడట.

అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కానీ ఓజీ మూవీ కచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో బెస్ట్ సినిమా అవుతుందని సినీ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తోంది. శ్రియా రెడ్డి ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. వారి పాత్రలు మూవీలో చాలా ప్రత్యేకంగా ఉంటాయంట.

సాహో సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా సుజిత్ కి మంచి ఇమేజ్ వచ్చిన ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఆ సినిమాలో ఎమోషన్స్ మిస్ కావడంతో మూవీ వర్క్ అవుట్ కాలేదని సినీ విశ్లేషకులు తేల్చేశారు. అయితే ఒజీ విషయంలో అలాంటి పొరపాట్లుకి అవకాశం ఇవ్వకుండా ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడంట. అందుకే ఈ స్థాయిలో ఒజీ మూవీపై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు.