Begin typing your search above and press return to search.

OG: ఒక్క పోస్టర్​ తోనే మంట పట్టేశారుగా

ఈ పోస్టర్​ చూస్తుంటే సినిమాలో హీరో ఎలివేషన్‌ ఏ రేంజ్​లో ఉంటుందో అర్థమైపోతుంది

By:  Tupaki Desk   |   10 Aug 2023 10:18 AM GMT
OG: ఒక్క పోస్టర్​ తోనే మంట పట్టేశారుగా
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ పవర్​ఫుల్​ మూవీ 'ఓజీ'(OG). టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. దీనిపై పవన్ ఫ్యాన్స్​లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమా నుంచి పవన్ కళ్యాణ్​కు సంబంధించిన అప్డేట్​ను ఆయన పుట్టినరోజు సందర్బంగా(సెప్టెంబర్ 2న) రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ స్పెషల్​ పోస్టర్​ను కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్​లో ముంబయిలోని ఒక పెద్ద భవంతి ముందు అర్ధరాత్రి వేళ కొంతమంది శత్రువులను చంపి.. అక్కడి నుంచి తన అనుచరులతో కలిసి వెళ్తున్నట్లుగా పవన్​ను వెనక నుంచి చూపించారు. "లొకేషన్‌ : చర్చ్‌గేట్‌ , సౌత్‌ బొంబాయి, టైమ్‌: 2.19 (ఏ.ఎం.), రైన్‌ఫాల్‌ డెన్సిటీ: 24 ఎం.ఎం, బ్లడ్‌ ఫ్లో డెన్సిటీ: 32 ఎం.ఎం, వెపన్స్‌ యూజ్డ్‌: sawed off double, Barreled Shotgun" అంటూ డీటైల్స్​ను పోస్టర్​పై వెల్లడించారు. "హీట్ వేవ్​ను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండండి. #Fire Strom Is Coming (అగ్ని తుపాన్‌ వస్తోంది)" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.

ఇంకా ఈ పోస్టర్​లో వర్షపు ధారను మించి ఎక్కువుగా రక్తపు ధారను ఒరిజినల్ గ్యాంగ్​స్టర్​ ఆకారంలో చూపించడం మరింత ఆసక్తిని పెంచింది. ఈ పోస్టర్​ చూస్తుంటే సినిమాలో హీరో ఎలివేషన్‌ ఏ రేంజ్​లో ఉంటుందో అర్థమైపోతుంది. చిన్న పోస్టర్‌తోనే ఈ రేంజ్​ ఎలివేషన్ ఇచ్చిన సుజీత్.. సినిమాలో భారీ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చి ఉంటాడని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే ఈ సినిమా స్టోరీ జపాన్‌ - ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని తెలిసింది. పవన్​కు జోడీగా హీరోయిన్ ప్రియా అరుళ్‌ మోహన్‌ కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి, నటుడు ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.