Begin typing your search above and press return to search.

పవన్ OG.. ఆ రెండు డేట్స్ లో ఒకటి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్

By:  Tupaki Desk   |   19 July 2023 6:09 AM GMT
పవన్ OG.. ఆ రెండు డేట్స్ లో ఒకటి..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న OG సినిమా సూపర్ స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయిందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో గ్యాంగ్ స్టర్ మూవీతో సుజిత్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. సెట్స్ మీదకు వెళ్లేప్పుడే ఫస్ట్ గ్లింప్స్ తో సుజిత్ OG మీద అంచనాలు పెంచాడు.

పవన్ కళ్యాణ్ OG సినిమా అనుకున్న విధంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆర్.ఆర్.ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ OG సినిమా డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. అది కుదరకపోతే 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ ఉందట. సంక్రాంతి టైం లో జనవరి 12, 13 తేడీల్లో సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

ఆల్రెడీ మహేష్ గుంటూరు కారం, ప్రభాస్ ప్రాజెక్ట్ కె లు సంక్రాంతికి రిలీజ్ షెడ్యూల్ చేసుకున్నారు. అయితే ఆ రెండు సినిమాలు దాదాపు వాయిదా పడటం పక్కా అని తెలుస్తుంది. అందుకే రవితేజ ఈగల్, విజయ్ దేవరకొండ పరశురామ్ సినిమా పొంగల్ రేసులో దిగుతున్నాయి. ఇక మరోపక్క OG డిసెంబర్ లో రిలీజ్ కుదరకపోతే మాత్రం సంక్రాంతికి పక్కా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.

పవన్ నటించిన బ్రో సినిమా ఈ నెల 28న రిలీజ్ అవుతుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఐదు నెలల్లోనే మరో సినిమాతో ఫ్యాన్స్ ని అలరించాలని చూస్తున్నారు పవర్ స్టార్. ఇక క్రిష్ డైరెక్షన్ లో ఉన్న హరి హర వీరమల్లు సినిమా ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంది.

హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే బ్రో, OG రిలీజ్ తర్వాతే ఆ రెండు సినిమాల గురించి ఆలోంచాలని పవన్ అనుకుంటున్నారట. హరి హర వీరమల్లు చేస్తున్న ఈ లేట్ వల్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆ సినిమా మీద ఉన్న ఆసక్తి తగ్గుతూ వస్తుంది. ఆ సినిమాను ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారని తెలిసిందే.