Begin typing your search above and press return to search.

OG రిలీజ్.. సెకండ్ ప్లాన్ అదేనా..?

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చేస్తుంది.

By:  Tupaki Desk   |   25 April 2024 3:54 AM GMT
OG రిలీజ్.. సెకండ్ ప్లాన్ అదేనా..?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా హంగ్రీ చీతా, OG పరిశీలనలో ఉన్నాయి. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చేస్తుంది. ఓ పక్క ఇదే బ్యానర్ లో వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్ లో వస్తున్న సరిపోదా శనివారం సినిమాలో కూడా ప్రియాంక హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఈ రెండు సినిమాలతో అమ్మడి రేంజ్ మారిపోతుందని చెప్పొచ్చు.

ఓజీ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రాబోతుందని తెలుస్తుంది. సినిమా టీజర్ లో పవర్ స్టార్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. సినిమా 60 శాతం వరకే పూర్తి కాగా పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వస్తే మరో నెల రోజులు షూటింగ్ పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ కారణంగా షూటింగ్స్ అన్ని పక్కన పెట్టి ఫోకస్ అంతా రాజకీయాల మీదే పెట్టాడు పవన్ కళ్యాణ్.

పవన్ రావాలంటే జూన్, జూలై వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఆ టైం లో కూడా పవన్ డేట్స్ ఇవ్వకపోతే ఆగష్టు కల్లా సినిమా పూర్తి చేసి సెప్టెంబర్ రిలీజ్ కష్టమవుతుంది. అందుకే OG రిలీజ్ అంటూ చెప్పిన సెప్టెంబర్ 27న సినిమా రావడం కష్టమే అంటున్నారు. ఓజీ సినిమా తో సుజిత్ మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు.

పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఫ్యాన్స్ ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటారో అందుకు ఏమాత్రం తగ్గకుండా OG ని తెరకెక్కిస్తున్నాడు సుజిత్. సినిమా ఒకవేళ సెప్టెంబర్ 27న రిలీజ్ కాకపోతే డిసెంబర్ రేసులో ఉండే ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ లో క్రిస్మస్ కు OG రిలీజ్ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ క్రిస్ మస్ రేసులో నితిన్ రాబిన్ హుడ్, నాగ చైతన్య తండేల్ రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో పవర్ స్టార్ వస్తే మాత్రం ఆ సినిమాలు సైడ్ ఇవ్వాల్సిందే. మరి మేకర్స్ OG విషయంలో ఏం ఆలోచిస్తున్నారో కానీ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.