Begin typing your search above and press return to search.

కంట్రోల్ చేద్దాం అనుకున్నా సరే.. OG హీరోయిన్ కామెంట్స్..!

స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం వాటిని ఎంతైనా తినేస్తా దాని వల్లే ఇలా తన లుక్ మారిందని అంటుంది ప్రియాంక.

By:  Tupaki Desk   |   3 Nov 2023 4:41 AM GMT
కంట్రోల్ చేద్దాం అనుకున్నా సరే.. OG హీరోయిన్ కామెంట్స్..!
X

కోలీవుడ్ భామ ప్రియాంక అరుల్ మోహన్ తెలుగులో రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత తమిళ సినిమాలకే పరిమితమైంది. అయితే అక్కడ యువ హీరోలతో పాటుగా స్టార్ హీరోలతో ఛాన్స్ లు అందుకున్న అమ్మడు లేటెస్ట్ గా తెలుగులో ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్ట్ లతో అదరగొట్టేస్తుంది అమ్మడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో OG లో అవకాశం అందుకున్న ప్రియాంకా ఆ సినిమాతో కచితంగా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.

సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియాంక ఫీమేల్ లీడ్ గా అవకాశం అందుకోవడం ఆమె కెరీర్ కి నిజంగానే బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇక మరోపక్క ఆ నిర్మాణ సంస్థ నానితో చేస్తున్న మరో సినిమాలో కూడా ప్రియాంకాని రిపీట్ చేస్తున్నారు. నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమాలో ప్రియాంకా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో ఆమె టాలీవుడ్ కెరీర్ కూడా సూపర్ ఫాం లోకి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

ఆల్రెడీ నానితో గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన ప్రియాంక మళ్లీ నానితో రెండో సినిమా చేస్తుంది. అయితే ప్రియాంకా ఇదివరకు కన్నా కాస్త బొద్దుగా మారింది. దీనికి కారణం ఏంటని అడిగితే తను స్వీట్స్ ఎక్కువగా తినడం వల్లే అని చెప్పింది. స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం వాటిని ఎంతైనా తినేస్తా దాని వల్లే ఇలా తన లుక్ మారిందని అంటుంది ప్రియాంక. అంతేకాదు తను కంట్రోల్ చేద్దాం అనుకున్నా సరే తన ఫ్రెండ్స్ బలవంతంగా స్వీట్స్ తినిపిస్తారని అందుకే ఈమధ్య కాస్త బొద్దుగా మారానని అంటుంది ప్రియాంక. కొన్మంది హీరోయిన్స్ స్లిం లుక్ లో ఇంప్రెస్ చేస్తారు.

కొంతమంది బొద్దుగా ఉన్నా సరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ప్రియాంక తన లుక్ తో కాదు నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని చూస్తుంది. ఈ ప్రయత్నంలో ఆమె ఎంచుకుంటున్న ప్రాజెక్ట్ లు కూడా క్రేజీగా ఉన్నాయని చెప్పొచ్చు. ఓజీ, నాని సినిమాలతో ప్రియాంక తెలుగులో తిరిగి సూపర్ ట్రాక్ లోకి వచ్చేస్తుందని చెప్పొచ్చు. మరి ఈ అవకాశాలను అమ్మడు ఎలా ఉపయోగించుకుంటుంది అన్నది చూడాలి. ఈ రెండు సినిమాల తర్వాత అయితే ప్రియాంకాకి తెలుగులో అవకాశాల విషయంలో డౌట్ అక్కర్లేదని మాత్రం అర్థమవుతుంది. పవన్ తో సినిమా చేశాక మిగతా దర్శక నిర్మాతలంతా ఆమె వెనక పడే ఛాన్స్ లేకపోలేదు.