మెగా హీరోలు టార్గెట్ గా సుజిత్ యూనివర్శ్!
ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ సంచలనం సుజిత్ కూడా యూనివర్శ్ ఆలోచనలో ఉన్నట్లు లీకైంది.
By: Tupaki Desk | 23 May 2025 11:21 AM ISTకోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తీసుకొచ్చిన సినిమాటిక్ యూనివర్శ్ ఎల్ సీయూ స్పూర్తితో మరింత మంది యూనివర్శ్ లో క్రియేట్ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పీసీయూ అంటూ తన యూనివర్శ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే నాగవంశీ నిర్మాత అయినా క్రియేటివ్ విభాగంలో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే వచ్చిన ఐడియానే 'మ్యాడ్' ప్రాంచైజీని , డీజే టిల్లు ప్రాంచైజీని ఓ యూనివర్శ్ గా క్రియేట్ చేయాలన్నది.
ఇదింకా ఆలోచన దశలో ఉంది. అందుకు ఆయన దర్శకులు ఒప్పుకుంటేనే సాద్యమవుతుంది. రిషబ్ శెట్టి కూడా యూనివర్శ్ క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ సంచలనం సుజిత్ కూడా యూనివర్శ్ ఆలోచనలో ఉన్నట్లు లీకైంది. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా 'ఓజీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'ఓజీ 2' కూడా ఉంటుందని మొదటి నుంచి వినిపిస్తుంది.
ఇది గ్యాంగ్ స్టర్ స్టోరీ కావడంతో 'ఓజీ' పేరిట యూనివర్శ్ ని క్రియేట్ చేసి అందులో మెగా హీరోలందర్నీ భాగం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు లీకులందుతున్నాయి. 'ఓజీ 2' ఉన్నా? అందులో ఎలాగూ పవన్ కళ్యాణ్ నటించడు. కాబట్టి 'ఓజీ 2'ని మరో మెగా హీరోతో చేయాలన్నది ప్లాన్ అట. ఈ నేపథ్యంలో పార్ట్ లో కి మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
చిరు కాకపోతే రామ్ చరణ్ రంగంలోకి దిగొచ్చు. అదే కాంపౌండ్ లో వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు. కాబట్టి గ్యాంగ్ స్టర్ కాన్పెప్ట్ పేరిట యూనివర్శ్ క్రియేట్ చేసి వరుసగా మెగా హీరోలతో సినిమాలు చేస్తే? ఎలా ఉంటుంది? అన్న కొత్త ఐడియాతో సుజిత్ ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి.
