పవన్ కళ్యాణ్ ఓజీ.. లుక్ విషయంలో ఏం చేస్తారు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఓజీ మూవీ మళ్లీ పట్టాలెక్కిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 16 May 2025 8:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఓజీ మూవీ మళ్లీ పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న హరిహర వీరమల్లును ఇటీవల పూర్తి చేసిన పవన్.. ఇప్పుడు ఓజీ సెట్స్ లో అడుగుపెట్టారు. ఆ విషయాన్ని మూవీ టీమ్ ప్రకటించింది. అసలైన ఓజీ.. షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టారంటూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది.
అయితే ఓజీ మూవీ షూటింగ్ ఇప్పటికే 75 శాతం కంప్లీట్ అయింది. ముంబై వంటి పలు నగరాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేశారు మేకర్స్. వరుస అప్డేట్స్ కూడా ఇచ్చి గ్యాంగ్ స్టర్ డ్రామాగా రానున్న సినిమాపై వేరే లెవెల్ లో హైప్ క్రియట్ చేశారు. కానీ ఇంతలో పవన్.. పాలిటిక్స్ లో బిజీ కావడం వల్ల షూటింగ్ హౌల్డ్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు పవన్ డేట్స్ ఇవ్వడంతో రీస్టార్ట్ అయింది.
దాదాపు ఒకటిన్నర ఏళ్ల తర్వాత పవన్ ఓజీ సెట్స్ కు వచ్చారు. ఇప్పుడు మిగిలిన పెండింగ్ పార్ట్ ను శరవేగంగా కంప్లీట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ప్లాన్ వేసుకుని డైరెక్టర్ సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య ముందుకు వెళ్తున్నారని సమాచారం. తాజా షెడ్యూల్ తో సినిమా మొత్తం చిత్రీకరణను ఒకేసారి పూర్తి చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారని టాక్.
ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారట. అదంతా ఓకే కానీ.. ఇప్పుడు మేకర్స్ కు ఓ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అది పవన్ లుక్ గురించే. ఎందుకంటే ఆయన ఫిజికల్ లుక్ లో చాలా తేడా వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ ఛేంజెస్ కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన ఎలాంటి బాడీ మేకోవర్ చేసుకున్నట్లు కనిపించడం లేదు.
దీంతో ఇప్పటికే చేసిన షూటింగ్ లోని లుక్ కు.. ఇప్పుడు చిత్రీకరణ చేస్తున్న లుక్ కు తేడా ఉంటుంది. అందుకే అప్పుడు ఇప్పుడు ఒకేలా కనిపించడానికి సీజీఐ, వీఎఫ్ ఎక్స్ వర్క్ పై మేకర్స్ ఆధారపడుతున్నారని సమాచారం. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ మూవీ సికిందర్ విషయంలో మేకర్స్ వాటినే వినియోగించారు. ఇప్పుడు ఓజీ చిత్రనిర్మాతలు కూడా అదే చేయనున్నారని తెలుస్తోంది.
ఇక మూవీ విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించనున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి సహా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఆ సినిమాతో పవన్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
