Begin typing your search above and press return to search.

OG: బిజినెస్ లెక్కలు ఏ రేంజ్ లో సాగుతున్నాయంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ OG సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.

By:  Tupaki Desk   |   12 July 2025 11:24 AM IST
OG: బిజినెస్ లెక్కలు ఏ రేంజ్ లో సాగుతున్నాయంటే?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ OG సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే టీజర్, మేకింగ్ వీడియోలతో సంచలనం రేపింది. పవన్ స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ప్యాకేజింగ్‌కు మాస్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ఈ సినిమా పైన మాస్ ఆడియన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. హై బడ్జెట్‌తో తెరకెక్కుతున్న OG సినిమాను RRR నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్‌కు విపరీతమైన క్రేజ్ ఉండటం వల్ల సినిమా రిలీజ్‌కు ముందే థియేట్రికల్ రైట్స్ బిజినెస్ హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లో OG సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో సాగుతోంది. విశాఖపట్నం ఏరియా థియేట్రికల్ రైట్స్‌ను సుమారు రూ. 21.80 కోట్లకు డీల్ చేసినట్టు సమాచారం. సాధారణంగా ఆంధ్ర ఏరియా మొత్తానికి ఒక పర్సంటేజ్ లెక్క ఉంటుంది. ఉదాహరణకు OG సినిమాకు ఆంధ్ర మొత్తం రూ. 80 కోట్లు ఉంటే, విశాఖపట్నానికి 24% అంటే సుమారు రూ. 19 కోట్ల వరకు రావాలి. కానీ OGకి ఉన్న క్రేజ్ కారణంగా పోటీ పెరిగి ఈ రేటు 26-27% వరకూ పెరిగినట్టు ట్రేడ్ టాక్. దాంతో ఈ ప్రాంతానికి రూ. 21.80 కోట్ల భారీ రేటు దక్కినట్లు తెలుస్తోంది.

అలాగే ఈస్ట్ గోదావరి ఏరియాను జనసేన ఎంపీ ఉదయ్, ఆయన మిత్రులు కలిసి కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈస్ట్ రేటు కూడా సాధారణంగా 16% ఉండగా, OG కోసం 18% వరకూ పెంచినట్టు టాక్. అలాగే గుంటూరు ఏరియాను ఆస్ట్రేలియా వెంకట్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ మొత్తాలు చూస్తే OG బిజినెస్ రేంజ్ ఏ స్థాయిలో నడుస్తోందో అర్థమవుతోంది.

మరోవైపు, ఉత్తరాంధ్ర రైట్స్‌ను వీరాంజనేయ ఫిలింస్ (జగ్గంపేట) వారు శ్రీదత్త కార్తికేయ ఫిలింస్‌తో కలిసి సుమారు రూ. 19.20 కోట్లకు పొందినట్టు తెలుస్తోంది. ఇది కూడా చాలా పెద్ద డీల్. ఈ ప్రాంతాల్లో OG సినిమా రిలీజ్ రైట్స్ సాధారణ రేంజ్ కంటే 2-3% ఎక్కువకు డీల్ కావడం పవన్ మార్కెట్‌ను మరోసారి రుజువు చేస్తోంది. ఇన్ని లెక్కలతో స్పష్టంగా చెప్పాలి అంటే, OG సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే దాదాపు రూ. 150 కోట్ల మార్క్ దాటబోతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకి ఇంకా టైం ఉన్నా, ఇప్పటికే మార్కెట్‌లో ఈ రేంజ్ హైప్ వచ్చిందంటే పవన్ స్టామినా ఎంత ఉందో చెప్పకనే చెప్పింది. విడుదల సమయానికి ఇది ఇంకెంత పెరుగుతుందో చూడాలి.