Begin typing your search above and press return to search.

అజ్ఞాతం అనంత‌రం గంభీర రంగంలోకా!

ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమా స్టోరీ లీకైంది. ఓజాస్ గంభీర మాఫియా సామ్రాజ్యం నుంచి ఒక్క‌సారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు.

By:  Tupaki Desk   |   31 Aug 2025 11:40 AM IST
అజ్ఞాతం అనంత‌రం గంభీర రంగంలోకా!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ క‌థానాయ‌కుడిగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య‌ `ఓజీ` తెర‌కె క్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. ఈ సినిమాతో ప‌వ‌న్ సాలిడ్ కంబ్యా క్ ఇస్తాడ‌ని అంచ‌నాలు భారీగా ఉన్నాయి. గ‌త ప‌రాజ‌యాల‌న్నింటికీ `ఓజీ` ఫ‌లితంతో స‌మాధానం చెబు తార‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే `ఓజీ` కంటెంట్ పై చ‌ర్చా మొదలైంది.

ఓజాస్ గంభీర ఎలా:

సినిమాలో ప‌వ‌న్ ఓజాస్ గంభీర పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఆరోల్ ఎలివేష‌న్ ఎలా ఉంటుంది? అన్న‌ది డైరెక్ట‌ర్ ని బ‌ట్టి అంచ‌నా వేయోచ్చు. ఈ విష‌యంలో సుజిత్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాడు. యాక్ష‌న్ ఫిలిం మేక‌ర్ గా త‌న స‌త్తా ఏంటో `సాహో`తోనే ప్రూవ్ చేసాడు. అందులో ప్ర‌భాస్ పాత్ర‌ను హైలైట్ చేయ‌డం ఆద్యంతం అల‌రించింది. `సాహో` తెలుగులో అనుకున్న ఫ‌లితాలు సాధించిన‌ప్ప‌టికీ హిందీ కి బాగా క‌నెక్ట్ అయింది. ఈ ర‌క‌మైన సానుకూల ఫ‌లితం తో ఓజాస్ గంభీర ఎలా ఉంటాడో? అభిమానుల ఊహ‌కే వ‌దిలేయాలి.

అజ్ఞాతం వీడిన అనంత‌రం:

ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమా స్టోరీ లీకైంది. ఓజాస్ గంభీర మాఫియా సామ్రాజ్యం నుంచి ఒక్క‌సారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ఈక్ర‌మంలో ఓమీ బావు ఇమ్రాన్ హ‌ష్మీ త‌న చీట‌కి సామ్రాజ్యాన్ని మ‌రింత విస్త‌రి స్తాడు. బ‌ల‌మైన మాఫియా కింగ్ లా మారుతాడు. దీంతో విష‌యం తెలిసిన ఓజాస్ గంభీర దాదాపు ప‌దేళ్ల అజ్ఞానం వీడి తిరిగి మ‌ళ్లీ ఆ చీక‌టి సామ్రాజ్యంలోకి అడుగు పెడ‌తాడు. అటుపై ఓజాస్ గంభీర‌- ఓమీ బావు మధ్య యుద్దం ఎలా మొద‌లైంది? అందుకు దారి తీసిన కార‌ణాలు ఏంటి? ఓజాస్ గ‌తం ఏంటి? అన్న‌ది ఆసక్తిక‌రంగా మ‌లిచిన‌ట్లు నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది.

అభిమానుల ఆశ‌ల‌న్నీ అత‌డిపైనే:

మ‌రి ఈ లీక్డ్ స్టోరీలో నిజ‌మెంతో తెలియాలి. కొన్ని సినిమాల‌కు పాయింట్ పాత‌దే అయినా దాన్ని ట్రీట్ చేసే విధానం సినిమా విజ‌యాన్ని నిర్ణ‌యిస్తుంది. మ‌రికొన్ని సినిమాల‌కు పాయింట్ కొత్త‌దైనా? ట్రీట్ మెంట్ కార‌ణంగా ఫెయిల్ అవుతుంటాయి. సుజిత్ గ‌త సినిమా అనుభ‌వాల నేప‌థ్యంలో అత‌డి అభి మానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. సినిమాలో స‌రికొత్త గ్యాంగ్ స్ట‌ర్ ని ఆవిష్క‌రిస్తాడ‌ని ఆశిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.