Begin typing your search above and press return to search.

OG టైటిల్ నాగవంశీదే.. అప్పుడే తమన్ చెప్పాడు: దానయ్య

ఇప్పుడు సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో దానయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓజీ టైటిల్ ను నిర్మాత నాగవంశీ రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు.

By:  Tupaki Desk   |   25 Sept 2025 6:08 PM IST
OG టైటిల్ నాగవంశీదే.. అప్పుడే తమన్ చెప్పాడు: దానయ్య
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఓజీ మూవీ నేడు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ డ్రామాగా ముంబై బ్యాక్ డ్రాప్ తో యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ కలిసి నిర్మించారు.

ఇప్పుడు సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో దానయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓజీ టైటిల్ ను నిర్మాత నాగవంశీ రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. తాము అడగ్గానే వెంటనే తమకు ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత సినిమా రిలీజ్ కు ముందే కాలర్ ఎగరేసుకుని తిరగమని తమన్ చెప్పినట్లు పేర్కొన్నారు.

ఇప్పుడు సినిమా రిజల్ట్ అంతే విధంగా ఉందని తెలిపిన దానయ్య.. అభిమానుల కేరింతలను ఆనందంతో తట్టుకోలేకపోతున్నామని చెప్పారు. అదే సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన లేకుంటే ప్రాజెక్ట్ లేనే లేదని వెల్లడించారు. త్రివిక్రమ్ సుజీత్ పేరును సూచించారని పేర్కొన్నారు.

తాను పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని అనుకున్నానని, వెంటనే త్రివిక్రమ్ ను అడిగినట్లు దానయ్య తెలిపారు. ఆయన సుజీత్ పేరు సూచించగా.. తాను కలిసినట్లు చెప్పారు. అప్పుడు సుజీత్ కథ చెప్పగా.. ఓకే చెప్పానని వెల్లడించారు. పవర్ స్టార్ అభిమానులతోపాటు సినీ ప్రియులు అంచనాలు భారీ స్థాయిలో పెట్టుకున్నారని తెలిపారు.

అందుకే తమ టీమ్ అంతా అంచనాలకు తగ్గట్టు కష్టపడ్డామని దానయ్య వెల్లడించారు. తమన్‌ తోపాటు ఎడిటర్‌ నవీన్‌ నూలి, సినిమాటోగ్రాఫర్‌ రవి కె. చంద్రన్‌ ఓజీ సినిమాకు మూలస్తంభాలు అంటూ కొనియాడారు. వారిందరితోపాటు మూవీకి సంబంధించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, సినిమా విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించగా.. ప్రకాష్ రాజ్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. సుధేవ్, సిరి లెళ్ల, శుభలేఖ సుధాకర్, అభిమన్యు సింగ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ సహా పలువురు నటీనటులు ఇతర పాత్రల్లో కనిపించారు. మరి మీరు ఓజీ మూవీ చూశారా?.. మీకెలా అనిపించింది?