పవన్-హష్మీ ఇంకా చేతులు కలపలేదా?
అయితే ఇంతవరకూ పవన్ తో తనకు ఎలాంటి కాంబినేషన్ సన్నివేశాలు చిత్రీకరిం చలేదని తాజాగా ఇమ్రాన్ హష్మీ తెలపడం సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 5 May 2025 3:46 PMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న గ్యాంగ్ స్టర్ చిత్రం 'ఓజీ' రిలీజ్ ఎప్పుడెప్పుడా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి 'హరిహరవీరమల్లు' పెండింగ్ షూటింగ్ కూడా డేట్లు ఇవ్వడం...షూట్ ఈరోజుతో పూర్తవ్వడంతో 'ఓజీ'కి డేట్లు ఇచ్చే ఉంటారని అంతా భావిస్తున్నారు. 'ఓజీ'కి డేట్లు కేటాయించారా? లేదా? అన్నది క్లారిటీ లేదు గానీ రిలీజ్ మాత్రం ఇంకా చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్‌మీ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ పుల్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఇమ్రాన్ పై షూటింగ్ లో పాల్గొన్నాడు. అతడిపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఇంతవరకూ పవన్ తో తనకు ఎలాంటి కాంబినేషన్ సన్నివేశాలు చిత్రీకరిం చలేదని తాజాగా ఇమ్రాన్ హష్మీ తెలపడం సంచలనంగా మారింది. అందుకు మరో రెండు.. మూడు నెలలైనా సమయం పటొచ్చన్నారు.
దీంతో 'ఓజీ' షూటింగ్ స్టేటస్ పై క్లారిటీ వస్తుంది. ఇద్దరి కాంబినేషన్ సన్నివేశాలు చిత్రీకరణకు రెండు నెలలు అంటే? జూన్ తర్వాత ఉంటుంది. కానీ పవన్ పై ఇంకా చాలా సోలో సన్నివేశాలు చిత్రీకరించాలి. అందుకు ఎంత సమయం పడుతుంది? అన్నది క్లారిటీ లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఇలా ఇన్ని సందేహాల మధ్య 'ఓజీ' పూర్తి చేయడం అన్నది అంత వీజీ కాదన్నది వాస్తవం.
ఇప్పటికే ఏడాది ఐదు నెలలు గడిచిపోయింది. ఈ ఐదు నెలల కాలంలో పవన్ అదిగో వస్తున్నాడు..ఇదిగో దిగుతున్నాడు? అన్న ప్రచారం తప్ప ఆయన వచ్చింది లేదు. షూటింగ్ చేసింది లేదు. మరి ఓజీ ఈ ఏడాదైనా రిలీజ్ అవుతుందా? అన్నది ఆ పెరుమాళ్లకే తెలియాలి.