Begin typing your search above and press return to search.

OGలో అది లేపేశారా.. ఎందుకలా..?

పవర్ స్టార్ ఓజీ సినిమా ఫ్యాన్స్ కైతే మంచి ట్రీట్ ఇచ్చేలా ఉంది. సుజిత్ మీద ఫ్యాన్స్ ఏవైతే హోప్ పెట్టుకున్నారో దాన్ని ఫుల్ ఫిల్ చేశాడు.

By:  Ramesh Boddu   |   25 Sept 2025 1:38 PM IST
OGలో అది లేపేశారా.. ఎందుకలా..?
X

పవర్ స్టార్ ఓజీ సినిమా ఫ్యాన్స్ కైతే మంచి ట్రీట్ ఇచ్చేలా ఉంది. సుజిత్ మీద ఫ్యాన్స్ ఏవైతే హోప్ పెట్టుకున్నారో దాన్ని ఫుల్ ఫిల్ చేశాడు. ఐతే కేవలం ఫ్యాన్స్ కి నచ్చితే సరిపోతుందా అంటే ఓజీ సినిమా చూసిన సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఓకే అనేస్తున్నాడు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒక్కసారి హై ఎనర్జీతో చూపించే సరికి ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఐతే ఇక్కడ వాస్తవం ఏటంటే సినిమాలో సుజిత్ స్టైలిష్ యాక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్ తప్ప కథ మాత్రం రొటీన్ గానే అనిపిస్తుంది.

పవర్ స్టార్ ఎలివేషన్స్..

పవర్ స్టార్ ఎలివేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీసినట్టు ఉన్నాడు సుజిత్. ఐతే స్టార్ సినిమా అంటే చాలు అవసరానికి మించి సీన్స్, సాంగ్స్ చేస్తారు. ముందు ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి ఈ సాంగ్ చేసింది. ఓజీలో స్పెషల్ సాంగ్ అంటూ నేహానే న్యూస్ లీక్ చేసింది. తీరా సినిమా చూస్తే అది మిస్సైంది. సినిమా లెంగ్త్ తో పాటు ఒక టెంపోలో వెళ్తున్న సినిమాకు సాంగ్ అడ్డు కాకూడదని అలా తీసేస్తున్నారు.

ఐతే నేహా శెట్టి సాంగ్ ని నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న డిస్కషన్ మొదలైంది. ఒకవేళ ఓజీ ఓటీటీ రిలీజ్ లో ఈ సాంగ్ యాడ్ చేస్తారా లేదా ఓజీ 2 అంటున్నారు కదా దాని కోసం వాడతారా అన్నది చూడాలి. నేహా శెట్టి మాత్రం తన సాంగ్ సినిమాలో లేనందుకు కాస్త డిజప్పాయింట్ అవుతుందని చెప్పొచ్చు.

కెరీర్ బెస్ట్ మ్యూజిక్..

ఓజీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు థమన్ వర్క్ గురించి స్పెషల్ మెన్షన్ చేస్తారు. ఎందుకంటే ఈ సినిమాకు కెరీర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఫ్యాన్స్ కి అయితే థమన్ మ్యూజిక్ తో ఫుల్ మీల్స్ అనేలా ట్రీట్ ఇచ్చాడు. ఓజీ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్ మాత్రం ఫ్యాన్స్ కి బాగా నచ్చేశాయి. సినిమా కథ విషయంలో సుజిత్ ఇంకాస్త ప్లానింగ్ చేసుకుని ఉంటే సినిమా మరో లెవెల్ లో ఉండేదని ఆడియన్స్ అంటున్నారు.

ఓజీ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటించింది. సినిమాలో స్పెషల్ సాంగ్ లో నేహా శెట్టి ఉన్నా కూడా ఫైనల్ రిలీజ్ లో దాన్ని లేపేశారు. ఐతే ఓటీటీ రిలీజ్ లో ఆ సాంగ్ యాడ్ చేస్తారేమో చూడాలి. డీజే టిల్లుతో పాటు టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటించిన నేహా శెట్టి పవర్ స్టార్ ఓజీలో సాంగ్ చేసిందని తెలిసి ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యారు. కానీ ఆ సాంగ్ సినిమాలో లేకపోవడం తెలిసి షాక్ అవుతున్నారు.