ఫినిషింగ్ ఇవ్వడానికి వచ్చిన విలన్ 'ఓజీ'
పవన్ కళ్యాణ్ సీన్స్ షూట్ పూర్తి అయిన వెంటనే ఇమ్రాన్ హష్మీ సీన్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేక పోయాడు.
By: Tupaki Desk | 25 Jun 2025 4:00 PM ISTపవన్ కళ్యాణ్, సాహో సుజీత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఓజీ' సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. కొన్ని వారాల క్రితమే పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ పూర్తి కావడంతో ఇక నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం అనుకున్నారు. అయితే సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇంకా బ్యాలెన్స్ ఉంది. విలన్ ఇమ్రాన్ హష్మీ పై సన్నివేశాల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ సీన్స్ షూట్ పూర్తి అయిన వెంటనే ఇమ్రాన్ హష్మీ సీన్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేక పోయాడు. దాంతో ఆ సన్నివేశాలు గత కొన్ని వారాలుగా వాయిదా పడుతూ వస్తున్నాయి.
తాజాగా ఆ సీన్స్ ఆలస్యంకు మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. ఇమ్రాన్ అనారోగ్యం కారణంగా షూటింగ్‌కు హాజరు కాలేక పోయాడు. ఆయనకు డెంగ్యూ ఎటాక్ కావడంతో దాదాపు మూడు నుంచి నాలుగు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్నాడు. అందుకే షూటింగ్‌కు రాలేదు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడంతో షూటింగ్‌కు రెడీ అయ్యారు. షూటింగ్ ప్రారంభం అయింది మొదలుకుని ఇప్పటి వరకు ఇమ్రాన్ హష్మీపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు ఫినిషింగ్ సీన్స్ చేయడం ద్వారా మొత్తం షూటింగ్ పూర్తి కాబోతుంది. దాదాపుగా వారం నుంచి పది రోజుల పాటు ఈ ఫినిషింగ్ సీన్స్ షూట్ ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల చివరి వరకు షూటింగ్‌ను పూర్తి చేసి, వచ్చే నెలలో ఏమైనా ప్యాచ్ వర్క్ ఉంటే కంప్లీట్ చేయడం ద్వారా షూటింగ్ మొత్తంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయింది. షూటింగ్ ఆలస్యం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ వచ్చారు. సుజీత్ దర్శకత్వంలో సినిమా అనగానే ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటున్నాయి. సాహో వంటి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్‌ను మాఫియా డాన్‌గా ఈ సినిమాలో చూపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన గ్లిమ్స్, పోస్టర్స్ కారణంగా అంచనాలు పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుజీత్ ఈ సినిమాను రూపొందించాడనే నమ్మకంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ సినిమా కంటే ముందు అంటే వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పవన్ చేస్తున్నాడు. ఓజీ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్ నటించగా, కీలక పాత్రలో నటి శ్రియా రెడ్డి నటించింది. ఇదే ఏడాదిలో మూడు సినిమాలతో పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
