Begin typing your search above and press return to search.

'ఓదెల 2' ట్రైలర్.. దైవానికి, దెయ్యానికి యుద్ధం

స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ ఓదెల 2.

By:  Tupaki Desk   |   8 April 2025 5:27 PM IST
Odela 2 Trailer
X

స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ ఓదెల 2. నాలుగేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా ఆ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని డైరెక్టర్ సంపత్ నంది గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

క్రేజీ సీక్వెల్ మూవీస్ లో ఒకటైన ఓదెల 2పై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. సూపర్‌ నేచురల్ థ్రిల్లర్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓదెల 2.. ఏప్రిల్ 17వ తేదీ రిలీజ్ కానున్నట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు.

అయితే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ మంగళవారం మధ్యాహ్నం ట్రైలర్ విడుదల చేశారు. దైవానికి, దెయ్యానికి మధ్య మహా యుద్ధం..శివ శక్తి సాక్ష్యం.. అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భరత ఖండాన దక్షిణ గంగా తీరాన ఆ పరమాత్ముడి పుట్టిల్లు ఓదెలలో ప్రేతాత్మ పురుడు పోసుకుంటుంది. ఇక ఆవిరైన రక్తపు బొట్టును.. అంటూ పవర్ పుల్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది.

ఆ తర్వాత తమన్నా శివశక్తిగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం మెయిన్ స్టోరీ లైన్ ను పరోక్షంగా అర్థమయ్యేలా చూపించారు మేకర్స్. ఆ ఊరిలో ప్రేత్మాత వల్ల అంతా భయపడుతుంటారు. దీంతో శివశక్తి తమన్నా ఆ ఊరికి వెళ్తారు. ఆ తర్వాత ప్రేతాత్మ ను ఎలా శివశక్తి ఆట కట్టించారో పూర్తి సినిమాగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

అయితే ఫస్ట్ పార్ట్ లో నటించిన హెబ్బా పటేల్, వశిష్ట, మురళీ శర్మ సీక్వెల్ లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఓదెల 2 ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఆద్యంతం మెప్పిస్తోంది. హారర్, థ్రిల్లింగ్ విజువల్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. కొన్ని షాట్స్ అయితే అద్భుతమనే చెప్పాలి. సినిమాలో ఫుల్ గా డివోషనల్ కంటెంట్ ఉన్నట్లు అర్థమవుతోంది.

సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ అదిరిపోయేలో ఉండనున్నట్లు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ముఖ్యంగా తమన్నా యాక్టింగ్ అయితే వేరే లెవెల్. కొన్ని సీన్స్ లో తన ఎక్స్ప్రెషన్స్ తో కచ్చితంగా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నారని చెప్పాలి. ఆమె డైలాగ్స్.. ఒక్కొక్కటి అద్భుతంగా ఉన్నాయి.

ఓవరాల్ గా ట్రైలర్ అయితే సింప్లీ సూపర్. అదే సమయంలో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. పక్కాగా మూవీ హిట్ అవుతుందని నమ్మకం పెంచేస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఓదెల-2 ఎలా ఉంటుందో.. తమన్నా అండ్ టీమ్ ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాలి.