Begin typing your search above and press return to search.

సక్సెస్ లేకున్నా.. రచ్చ డైరెక్టర్ కిర్రాక్ బిజినెస్ స్ట్రాటజీ

ఏమైంది ఈ వేళ.. అనే రొమాంటిక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు సంపత్ నంది'ని ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు.

By:  Tupaki Desk   |   7 April 2025 8:52 PM IST
సక్సెస్ లేకున్నా.. రచ్చ డైరెక్టర్ కిర్రాక్ బిజినెస్ స్ట్రాటజీ
X

ఏమైంది ఈ వేళ.. అనే రొమాంటిక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు సంపత్ నంది'ని ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. రెండవ ఛాన్స్ తోనే రచ్చ చేసి షాక్ ఇచ్చాడు. రామ్ చరణ్ తో చేసిన రచ్చ కమర్షియల్ గా బాగానే క్లిక్కయినా ఆ తరువాత మళ్ళీ మరో రేంజ్ హీరోతో ఛాన్స్ రాలేదు. పవన్, వెంకీ లాంటి హీరోలతో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారింది. ఇక గోపిచంద్ తో గౌతమ్ నంద లాంటి సినిమాతో కంటెంట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు అందుకున్నాడు.

కంటెంట్ ఉన్న దర్శకుడే గాని అతనికి సాలీడ్ హిట్ అయితే రాలేదు. అయినప్పటికీ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు నిర్మాతగా కూడా అతను సినిమాలు చేస్తూ మంచి బిజినెస్ స్ట్రాటజీతో ప్రాఫిట్స్ అందుకుంటున్నాడు. ఇప్పుడు 'ఒదెల 2' అనే భారీ ప్రాజెక్ట్‌కి షోరన్నర్‌గా వ్యవహరిస్తూ మరోసారి తన క్రియేటివ్‌ పవర్‌ను నిరూపించుకున్నాడు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలతో పాటు డైరెక్షన్ పరంగా కూడా గైడెన్స్ అందించారు. అశోక్ తేజ ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, సంపత్ నంది సూపర్విజన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది.

మొదటి భాగమైన 'ఒదెల రైల్వే స్టేషన్'కు మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత, ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈసారి తమన్నా భాటియా లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా జనాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా జూలై 17న విడుదల కానుంది. ఇప్పటికే టీజర్‌కు వచ్చిన స్పందన చూసిన నిర్మాతలు, ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ డీల్స్ క్లోజ్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో పాటు ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను శంకర్ పిక్చర్స్ (శంకర్, సురేష్ రెడ్డి కొవ్వూరి) 10 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఈ డీల్‌తో ఒక్కసారిగా మార్కెట్‌లో సినిమా విలువ పెరిగింది. హిందీ, తమిళ థియేట్రికల్ హక్కులను ప్రొడ్యూసర్స్ దగ్గరే ఉంచుకోవడం ద్వారా అక్కడ బిజినెస్‌ను మరింత లాభంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడయ్యాయి.

డిజిటల్ హక్కులు ఏకంగా రూ.18 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ డీల్‌లో తెలుగులోని అన్ని భాషలకు సంబంధించి శాటిలైట్ హక్కులు ఇంకా కలుపలేదు. అంటే టోటల్‌గా రిలీజ్‌కు ముందే సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయిందని చెప్పాలి. సినిమా మొత్తం బడ్జెట్ 25 కోట్లు కాగా, ప్రీ రిలీజ్ బిజినెస్‌తో నిర్మాతలకు ఇప్పటికే లాభాలు దక్కాయి. ఇది ప్రస్తుతం బిగ్ హీరోల సినిమాలకే కష్టంగా మారిన పరిస్థితుల్లో ఇలాంటి సినిమాకు ప్రాఫిట్ డీల్స్ సెట్టవ్వడం విశేషం.

ఈ విజయానికి కారణం సంపత్ నంది పేరు మీద నమ్మకం అని చెప్పవచ్చు. కథా ప్రణాళిక, స్క్రీన్ ప్రెజెంటేషన్, కమర్షియల్ టచ్‌లను బలంగా నిలిపిన ఆయన, 'ఒదెల 2'ను మార్కెట్‌వైపు ఓ వరంలా మార్చేశాడు. తక్కువ టైమ్‌లో బిజినెస్ వాల్యూను పెంచడంలో ఆయన పాత్ర కీలకం. ఎందుకంటే టైమ్ కు తగ్గట్లే అప్డేట్స్ ఇవ్వడం, కంటెంట్ గురించి జనాలు మాట్లాడుకునేలా చేసిన విధానం బాగా హైలెట్ అయ్యింది. దీనితో పాటు తమన్నా బిజినెస్ వాల్యూ, పాన్ ఇండియా ప్రెజెంటేషన్ వల్ల సినిమా మార్కెట్‌లో స్పెషల్ స్టేటస్ సంపాదించింది. ఇక డీ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముంబయిలో ట్రైలర్ లాంచ్ గ్రాండ్ ఈవెంట్‌గా జరగనుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై మిగతా భాషల్లోనూ హైప్ పెరిగే అవకాశముంది.