Begin typing your search above and press return to search.

గామి, ఓం భీమ్ బుష్.. అక్కడ కూడా దూకుడే!

గామి, ఓం భీమ్ బుష్ సినిమాలు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 April 2024 10:35 AM GMT
గామి, ఓం భీమ్ బుష్.. అక్కడ కూడా దూకుడే!
X

గామి, ఓం భీమ్ బుష్ సినిమాలు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వేసవి కానుకగా విడుదలైన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు అందుకున్నాయి. గామి ప్రయోగాత్మక చిత్రంగా అలరించగా.. ఓం భీమ్ బుష్ కామెడీకి సినీ ప్రియులు తెగ నవ్వుకున్నారు. ఈ రెండు సినిమాలను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రూపొందించింది.


ప్రస్తుతం ఈ రెండు మూవీలు థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని ఓటీటీల్లోకి వచ్చేశాయి. జీ5లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గామి సినిమా సందడి చేస్తుండగా.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఓం భీమ్ బుష్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ రెండు సినిమాలు.. ఓటీటీలో కూడా క్రేజీ రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి.

ఆయా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో గామి, ఓం భీమ్ బుష్ సినిమాలు టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి. జీ5లో విద్యాధర్ కగిత దర్శకత్వం వహించిన గామి మూవీ నెం.1 స్థానంలో కొనసాగుతోంది. శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించిన ఓం భీమ్ బుష్ మూవీ.. ప్రైమ్ వీడియోలో టాప్-2 ట్రెండింగ్ లో ఉంది. దీంతో యూవీ క్రియేషన్స్ ఫుల్ ఖుషీగా ఉంది. ఇటీవల కాలంలో ఈ సంస్థ మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కిస్తూ హిట్లు కొడుతోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్, విక్రమ్ స్థాపించిన యూవీ క్రియేషన్స్.. మిర్చి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ప్రభాస్, అనుష్క కాంబోలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ప్రభాస్ కు కూడా ఈ సంస్థలో షేర్ ఉందని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అది నిజమో కాదో మాత్రం తెలియదు. అలా మిర్చితో మొదలైన యూవీ క్రియేషన్స్ జర్నీ.. ఇప్పుడు దిగ్విజయంగా ముందుకు సాగుతోంది.

ఓ వైపు యూవీ క్రియేషన్స్ పెద్ద హీరోలతో మూవీలు చేస్తూనే.. మరోవైపు వి సెల్యూలాయిడ్ పతాకంపై మిడ్ రేంజ్ హీరోలతో కూడా చిత్రాలు తీస్తోంది. టాలీవుడ్ లో మిగతా సంస్థలకు భిన్నంగా సినిమాలు రూపొందిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీతో పాటు పలు చిత్రాలను నిర్మిస్తోంది. మరి ఆ సినిమాలన్నీ ఎలాంటి రిజల్ట్ సాధిస్తాయో వేచి చూడాలి.