Begin typing your search above and press return to search.

అమ్మా నాన్న స్టార్స్‌ ఐనా ఆమె రూటే సపరేట్‌

నైషా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అజయ్ దేవగన్‌ అభిమానులు నిరుత్సాహపడే విధంగా ప్రకటన చేసింది.

By:  Tupaki Desk   |   9 April 2025 7:00 PM IST
Nysa Devgn Bollywood Debut
X

సౌత్‌తో పోల్చితే నార్త్‌ ఇండియాలో స్టార్‌ కిడ్స్‌ హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇవ్వడం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సౌత్‌లో కేవలం హీరోలుగా మాత్రమే వారసులు నిలదొక్కుకుంటున్నారు. కొందరు స్టార్‌ కిడ్స్ హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారు అంతగా రాణించలేక పోతున్నారు. కానీ నార్త్‌ ఇండియాకు చెందిన స్టార్ కిడ్స్ సౌత్ ఇండియాలో వరుసగా ఆఫర్లు సొంతం చేసుకుంటున్నారు. అందుకే బాలీవుడ్‌ స్టార్ కిడ్స్‌కి మంచి డిమాండ్ ఉంది. వద్దన్నా ఆఫర్లు ఇచ్చేందుకు ఫిల్మ్‌ మేకర్స్ రెడీ అంటున్నారు. ఇప్పటికే షారుఖ్ ఖాన్‌ కూతురు, ఆమీర్ ఖాన్‌, కూతురు, సైఫ్ అలీ ఖాన్‌ కూతురు ఇలా ఎంతో మంది స్టార్ కిడ్స్‌ హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ కూతురు నైషా దేవగన్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్తలు వచ్చాయి. నైషా తల్లి కాజోల్‌ సైతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్టార్‌డం దక్కించుకుంది. అమ్మా, నాన్న ఇద్దరూ స్టార్స్‌ కావడంతో నైషా ఖచ్చితంగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంతా భావించారు. ఆమె సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ చూస్తే నైషా కి నటనపై ఆసక్తి ఉన్నట్లు అనుకుంటారు. కానీ తాజాగా నైషా తల్లి కాజోల్‌ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది. నైషా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అజయ్ దేవగన్‌ అభిమానులు నిరుత్సాహపడే విధంగా ప్రకటన చేసింది.

నైషాకి హీరోయిన్‌గా నటించాలనే ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చిన్న వయసు అమ్మాయి. ఆ కారణంగా నటనపై ఆసక్తి చూపడం లేదు. ముందు ముందు కూడా ఆమెకు నటనపై ఆసక్తి కలుగుతుంది అనే నమ్మకం లేదు అన్నట్లుగా కాజోల్‌ చెప్పుకొచ్చింది. నైషా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తానంటే ఆఫర్లు ఇచ్చేందుకు ఎంతో మంది ఫిల్మ్‌ మేకర్స్ రెడీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ గతంలోనే పలు సార్లు కాజోల్‌ను, అజయ్ దేవగన్‌ను నైషా ఎంట్రీ గురించి అడిగాడని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో నైషా ఎంట్రీ గురించి మరోసారి వార్తలు వస్తున్న కారణంగా కాజోల్‌ ఫుల్‌ క్లారిటీ ఇచ్చింది. ఇకపై నైషా సినిమా ఎంట్రీ గురించి ఎలాంటి పుకార్లు ఉండకూడదని ఆమె భావిస్తోంది.

భవిష్యత్తులో నైషాకి నటించాలనే ఆసక్తి కలిగితే కచ్చితంగా ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులుగా మేము సిద్ధంగా ఉన్నామని కాజోల్‌ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో నైషాకి ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు. అమ్మా నాన్న ఇండస్ట్రీలో స్టార్స్‌ అయినప్పటికీ నైషా మాత్రం తన రూటే సపరేటు అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ముందు ముందు అయిన తన తోటి వారిని ఫాలో అయ్యి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.