Begin typing your search above and press return to search.

కాజోల్ న‌ట‌వార‌సురాలిని చూశారా?

నేటి జెన్ జెడ్ న‌టవార‌సురాళ్ల‌తో పోటీప‌డుతూ ఈ బ్యూటీ అందాల‌ను ఆర‌బోస్తోంది. తాజాగా నైసా దేవ‌గ‌న్ కొత్త అవ‌తారంలో క‌నిపించింది.

By:  Tupaki Desk   |   28 April 2025 5:00 PM
కాజోల్ న‌ట‌వార‌సురాలిని చూశారా?
X

ఐదేళ్ల క్రితం నైసా వేరు.. ఇప్ప‌టి నైసా వేరు! ఇంత నైసుగా ఎలా మారిందో కానీ, ఇటీవ‌ల‌ న‌ట‌వార‌సురాలి ఫోటోషూట్ల‌ దూకుడు అమాంతం పెరిగింది. ప్రతి ఈవెంట్లోను త‌ల్లి కాజోల్ తో పోటీప‌డి ఫోటోగ్రాఫ‌ర్స్ కి ఫోజులిస్తోంది. మ‌మ్మీని మించి నైసా నైసుగా ద‌ర్శ‌న‌మిస్తోంది. త‌న‌తో క‌లిసి ఈవెంట్ల‌లో బోలెడంత సంద‌డి చేస్తోంది. అది పెళ్లి వేడుక లేదా సినిమా ఈవెంట్, లేదా ఇంకేదైనా కానీ కాజోల్ తో పాటు నైసా దేవ‌గ‌న్ క‌నిపిస్తోంది.

మునుప‌టితో పోలిస్తే నైసా దేవ‌గ‌న్ గ్లామ‌ర‌స్ వేష‌ధార‌ణలు వెబ్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. నేటి జెన్ జెడ్ న‌టవార‌సురాళ్ల‌తో పోటీప‌డుతూ ఈ బ్యూటీ అందాల‌ను ఆర‌బోస్తోంది. తాజాగా నైసా దేవ‌గ‌న్ కొత్త అవ‌తారంలో క‌నిపించింది.

ప‌ద‌హార‌ణాల దేశీ గాళ్ లా ప‌ట్టు ప‌రికిణీలో గుబులు రేపింది. ఎరుపు, గోల్డ్ మిశ్రమ రంగు ప‌రికిణీ దానికి కాంబినేష‌న్ గా బిస్కెట్ క‌ల‌ర్ టాప్ ధ‌రించి మెడ‌లో కాంబినేష‌న్ వ‌జ్రాల హారం ధ‌రించి నైసా ధ‌గ‌ధ‌గా మెరిసిపోతోంది. 22 ఏళ్ల నైసా అంద‌చందాలు మైమ‌రిపిస్తున్నాయి.

ఈ లుక్ చూడ‌గానే నైసా నైసుగుంద‌మ్మా! అంటూ అభిమానులు త‌న అందాన్ని పొగిడేస్తున్నారు. ఇదే హుషారులో నైసా సినీ ఎంట్రీ ఇస్తుంద‌ని ఊహిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ కాజోల్- అజయ్ దేవ‌గ‌న్ త‌మ కుమార్తె సినీఎంట్రీ గురించి ఎలాంటి హింటూ ఇవ్వ‌లేదు. ఇటీవల నైసా దేవగన్ తన తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ నటిగా మారాలని కోరుకోవడం లేదని కాజోల్ వెల్ల‌డించడం నిరాశ క‌లిగించింది. ప్ర‌స్తుతానికి నైసా స్ట‌డీస్ పైనే దృష్టి సారిస్తోందని స‌మాచారం.