Begin typing your search above and press return to search.

బికినీ ధ‌రింలేన‌ని డైరెక్ట‌ర్‌తో హీరోయిన్ గొడ‌వ‌

నేను నా జీవితంలో ఎప్పుడూ బికినీని ధరించలేదు.. కాబట్టి బికినీ కోసం మెంటల్ గా ప్రిపేర్ కాలేద‌ని అతడితో చెప్పాను.

By:  Tupaki Desk   |   22 Aug 2023 4:39 AM GMT
బికినీ ధ‌రింలేన‌ని డైరెక్ట‌ర్‌తో హీరోయిన్ గొడ‌వ‌
X

హిందీ పాపుల‌ర్ నటి నుష్రత్ భరుచ్చా పేరు ఇటీవ‌ల మార్మోగుతోంది. నుష్రత్ బరుచ్చా న‌టించిన తాజా చిత్రం 'అకెల్లి' ఈ శుక్రవారం విడుదలవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తాను తొలిసారి బికినీ ధ‌రించిన‌ విషయంపై మాట్లాడారు. పాపుల‌ర్ మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో నుష్రత్ భరుచ్చా తన బ్రేకవుట్ ఫిల్మ్ 'ప్యార్ కా పంచ్‌నామా' షూటింగ్‌లో ఉన్నప్పుడు బికినీ ధరించడాన్ని ఎలా వ్య‌తిరేకించిందో ఓపెనైంది. 'చక్ గ్లాసి' పాటను గోవాలో చిత్రీకరించిన స‌మ‌యంలో అలాగే మరికొన్ని సన్నివేశాల కోసం ఆ చిత్రంలోని ముగ్గురు క‌థానాయిక‌లు బికినీలు ధరించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ తాను ఆ స‌మ‌యంలో అలా చేయ‌లేన‌ని ద‌ర్శ‌కుడికి చెప్పిన‌ట్టు నుష్ర‌త్ గుర్తు చేసుకుంది. ప్యార్ కా పంచ్‌నామాకు ముందు నేను బికినీ ధరించలేదని కూడా నుష్రత్ భరుచ్చా తెలిపింది.

ఆ సమయంలో దర్శకుడు లవ్ రంజన్‌తో జరిగిన చర్చల గురించి భరుచ్చా మాట్లాడింది.''నేను నా జీవితంలో ఎప్పుడూ బికినీని ధరించలేదు.. కాబట్టి బికినీ కోసం మెంటల్ గా ప్రిపేర్ కాలేద‌ని అతడితో చెప్పాను. నిజానికి బికినీతో ఎలా సుఖంగా ఉండాలో నాకు తెలియదు'' అని వెల్ల‌డించింది. ప్యార్ కా పంచనామా సీక్వెల్‌లో నేను బికినీలో ఆడి పాడాను.. అని నుష్ర‌త్ గుర్తుచేసుకుంది.

అయితే తరువాతి కొన్ని సంవత్సరాలలో భరుచ్చా తన నిజ జీవితంలో బికినీలు ధరించడం ప్రారంభించిందట‌. ఇది ఆమె బాడీ పాజిటివిటీని స్వీకరించడంలో సహాయపడింది. ఆన్ స్క్రీన్ లోనే కాదు.. ఆఫ్ ద స్క్రీన్ లోను ఆత్మ‌విశ్వాసాన్ని పెంచింది.. అని తెలిపింది. నేను ఏ ఆకృతిలో ఉన్నా బికినీలు వేసుకున్నాను. నేను బీచ్‌లకు, స్విమ్మింగ్ కోసం వెకేష‌న్స్ కి వెళ్లాను. తరచుగా బికినీలు ధరించడం ప్రారంభించాను అని తెలిపింది. అప్పటివ‌ర‌కూ బికినీ ధ‌రించ‌ని నేను ప్యార్ కా పంచ‌నామా కోసం సాహ‌సం చేసాను. అలాగే పార్ట్ 2లో నేను బికినీలో ఆడాను. ఉదయం నుండి రాత్రి వరకు బికినీలోనే ఉన్నాను. నేను ఇక దేనినీ పట్టించుకోలేదు... అని తెలిపింది. ద‌ర్శకుడితో 'నేను చాలా సౌకర్యంగా ఉన్నాను.. ఇప్పుడు ఏవీ పట్టించుకోను' అని చెప్పాను. అది నాకు చాలా పెద్ద విషయం అని కూడా నుష్ర‌త్ గుర్తు చేసుకుంది.

నుష్ర‌త్ న‌టించిన 'అకెల్లి' ఆగస్ట్ 25న విడుదలవుతుంది. ఈ సినిమా ఆయుష్మాన్ నటించిన డ్రీమ్ గర్ల్ 2తో ఢీకొంటోంది. నుష్రత్ భరుచ్చా చివరిసారిగా అక్షయ్ కుమార్ నటించిన సెల్ఫీ చిత్రంలో కనిపించింది.

నాన్ గ్లామ్ అవతార్‌లో...

త‌దుప‌రి చిత్రం అకెల్లిలో ప్యార్ కా పంచ్‌నామా చిత్రాలతో పోలిస్తే నుష్రత్ భరుచ్చా పూర్తిగా భిన్నంగా క‌నిపించ‌నుంది. యుద్ధంలో ఇరాక్‌లో చిక్కుకుపోయిన మధ్యతరగతి మహిళగా భరుచ్చా ఈ చిత్రంలో న‌టించింది. పూర్తిగా నాన్ గ్లామరస్ లుక్‌లో కనిపించ‌నుంది. ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ 2తో పోటీప‌డుతూ 'అకెల్లి' ఆగస్ట్ 25న విడుదల కానుంది.