Begin typing your search above and press return to search.

చెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్మ‌లేవు చిట్టీ

చెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్మేయ‌డం అంటే ఇదేనేమో! ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రూ సొంత ఫ్యాష‌న్ లేబుల్ స్టార్ట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 11:23 PM IST
చెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్మ‌లేవు చిట్టీ
X

చెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్మేయ‌డం అంటే ఇదేనేమో! ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రూ సొంత ఫ్యాష‌న్ లేబుల్ స్టార్ట్ చేస్తున్నారు. స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు కొత్త బ్రాండెడ్ వ‌స్త్ర శ్రేణిని ప‌రిచ‌యం చేస్తున్నామ‌ని దుస్తుల వ్యాపారం అంతం చూస్తున్నారు!! ఈ జాబితాలో ఇప్పుడు ప్ర‌ముఖ హీరోయిన్ చెల్లెలు కూడా చేరింది.

స‌ర‌స‌మైన ధ‌ర‌లు అంటే... షార్ట్ ధ‌ర రూ.2500. కాల‌ర్ లేని టీష‌ర్ట్ ధ‌ర రూ.5000. కొన్ని కంపెనీల షూస్ ధ‌ర‌లు 10,000 నుంచి ల‌క్ష వ‌ర‌కూ. వీటిని స‌ర‌స‌మైన ధ‌ర‌లు అనుకోవాలి. ఇప్పుడు బాలీవుడ్ లో వేగంగా ఎదిగేసిన కృతి స‌నోన్ సోద‌రి నూపుర్ స‌న‌న్ కూడా ఒక ఫ్యాష‌న్ బ్రాండ్ NOBO (నో బౌండరీస్ కు సంక్షిప్త రూపం) ను ప్రారంభించి సోషల్ మీడియాల్లో మోతెక్కించేస్తోంది. `ఓవర్ ప్రైస్డ్ ఫాస్ట్ ఫ్యాషన్` అంటూ యూత్ లో ప్ర‌చారం చేసుకుంటోంది కూడా.

ఈ బ్రాండ్ దుస్తులు ఆన్ లైన్ లో కొనేవారికి క‌ళ్లు భైర్లు క‌మ్ముతున్నాయి. క్ష‌ణాల్లోనే ధ‌ర ట్యాగ్ చూసి ఆన్ లైన్ నుంచి త‌ప్పుకుంటున్నారు. వెంట‌నే ఆ వెబ్ సైట్ ని స్కిప్ కొట్టేసి ఫ్లిప్ కార్ట్ కి వెళుతున్నారు. మైంత్ర లాంటి చోట్ల రూ.300 కే దొరికే వ‌స్తువును ఇక్క‌డ వేల‌కు వేలు పోసి ఎవ‌రైనా కొంటారా? NOBO వెబ్‌సైట్‌ను ప‌రిశీలిస్తే, జాబితాలో ఉన్న అతి తక్కువ ధర కలిగిన వస్తువు రూ. 2,400. అది కూడా క్యాజువల్ షార్ట్స్ ధ‌ర‌. అయితే అత్యంత ఖరీదైన ఉత్పత్తి - సాంప్రదాయ కుర్తా సెట్ - ధర రూ. 26,500. పాశ్చాత్య దుస్తులలో స్కర్ట్, క్రాప్ టాప్ కాంబో రిటైలింగ్ రూ. 20,000 రేంజులో ఉన్నాయి. సాధా సీదా దుస్తులు కూడా రూ. 7,000 నుండి ప్రారంభమవుతాయి. ఈ ధ‌ర‌ల ట్యాగ్ లు చూసి నోరెళ్ల‌బెట్ట‌డం ప‌బ్లిక్ వంతు అయింది. ప్ర‌స్తుతం రెడిట్ లో నూపూర్ నోబో బ్రాండ్ ని ఆడుకుంటున్నారు.

హైద‌రాబాద్ కోటి సెంట‌ర్, వైజాగ్ జ‌గ‌దాంబ సెంట‌ర్ లో కూడా ఇలాంటి బ్రాండ్లు రూ.200 కే దొరుకుతాయి అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్నారు. ఆమె బ్రాండ్ పేరు అసంపూర్ణంగా ఉందని.. ఎందుకంటే ఆమె లేబుల్ నోబొడీ ఈ ఓవర్‌ప్రైస్డ్ ఫాస్ట్ ఫ్యాషన్ షిట్ ఫ్రమ్ మీ అని రాయడం మర్చిపోయిందని ఒక నెటిజ‌న్ కామెంట్ చేసాడు. మరొకరు `లేబుల్ నోబో - నో వన్ బై వన్` అని వ్యాఖ్య‌ను జోడించాడు. మరికొందరు ధర- నాణ్యత మధ్య పెద్ద తేడాను ఎత్తి చూపారు. నోబో నాణ్యత చాలా దారుణంగా ఉంది. ఉత్తమంగా ధర 1k ఉండాలి - అది కూడా అలాంటి పేలవమైన డిజైన్లకు చాలా ఎక్కువ అని రాసారు. నో బో అనేది `ఎవరూ దానిని కొనలేదు` అనే దానికి సంక్షిప్త రూపం! అని ఒక‌రు కామెంట్ చేసారు. ఈ కంపెనీలో ధ‌ర‌ల‌కు నో బౌండ‌రీస్ అని కూడా న‌వ్వుకున్నారు.

మొత్తానికి సెల‌బ్రిటీలు చెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్మేయ‌డం కుద‌ర‌దు. జ‌నం నెత్తిన కుచ్చు టోపీ పెట్ట‌డం అస‌లే వీలు ప‌డ‌దు! ఒక‌సారి వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్ తిరిగి రాక‌పోతే, ఇక ఆ కంపెనీ మూసుకోవాల్సిందే. ఇలాంటి అనుభ‌వాలు ఎన్నో ఉన్నాయి చాలా మందికి. కాబ‌ట్టి వ‌స్తువు నాణ్య‌త‌కు ధ‌ర‌కు మ‌ధ్య స‌మ‌తూకం త‌ప్ప‌నిస‌రి.