Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో నెంబ‌ర్-1 ఇంకా ఖాళీగానే!

టాలీవుడ్ లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ స్థానం ఇంకా భ‌ర్తీ కాలేదా? సీనియ‌ర్లు రిలాక్స్ అవుతున్నా..జూనియ‌ర్ భామ‌లు ఫాంలో ఉన్నా ఇంకా ఆస్థానం ఎవ‌రూ చేజిక్కించుకోలేదా?

By:  Tupaki Desk   |   10 March 2024 10:30 AM GMT
టాలీవుడ్ లో నెంబ‌ర్-1 ఇంకా ఖాళీగానే!
X

టాలీవుడ్ లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ స్థానం ఇంకా భ‌ర్తీ కాలేదా? సీనియ‌ర్లు రిలాక్స్ అవుతున్నా..జూనియ‌ర్ భామ‌లు ఫాంలో ఉన్నా ఇంకా ఆస్థానం ఎవ‌రూ చేజిక్కించుకోలేదా? అంటే అవుననే తెలుస్తోంది. అనుష్క శెట్టి..కాజ‌ల్ అగ‌ర్వాల్..త‌మ‌న్నా..స‌మంత‌ లాంటి సీనియ‌ర్ భామ‌లు ఫాంలో ఉన్నంత కాలం నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఎవ‌రంటే? ఆ న‌లుగురిలో ఎవ‌రో ఒక‌రి పేరు వినిపించేది. కానీ ఇప్పుడా భామ‌లు అంత యాక్టివ్ గా సినిమాలు చేయ‌ని సంగ‌తి తెలిసిందే.

ఆ ముగ్గురు భామ‌లు స్టార్ డ‌మ్ ని ఆస్వాదించినంత కాలం టాలీవుడ్ లో బాగానే చెల్లుబాటు అయ్యారు. కానీ మ‌ళ్లీ కంబ్యాక్ అవ్వాల‌నుకునే స‌రికి ఆ భామ‌ల స్థానాల్లోకి కొత్త భామ‌లు వ‌చ్చేసారు. ర‌ష్మిక మంద‌న్న‌.. శ్రీలీల‌...కీర్తి సురేష్‌..సాయిప‌ల్ల‌వి భామ‌లు సంచ‌ల‌నం అవ్వ‌డం మొద‌లైంది. కొంత కాలంగా టాలీవుడ్ లో వీళ్ల‌దూకుడే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. వ‌రుస‌గా అగ్ర హీరోల‌తో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

అలాగ‌ని వాళ్ల‌లో ఎవ‌రో ఒక‌రికి నెంబ‌ర్ వ‌న్ అనే ట్యాగ్ ఇవ్వ‌డం అన్న‌ది స‌మ‌జసం కానిది. వాళ్లింకా ఆస్థాయికి చేరుకోలేద‌న్న‌ది వాస్త‌వం. ఈ గ్యాప్ లో వాళ్ల‌కి పోటీగా కొత్త భామ‌ల జోరు క‌నిపిస్తుంది. ఆషికా రంగ‌నాధ్..జాన్వీ క‌పూర్..మీనాక్షి చౌద‌రి లాంటి భామ‌లు వేగంగానే సినిమాలు చేస్తున్నారు. ఈ భామ‌లు వ‌రుస‌గా స‌క్సెస్ లు అందుకుంటే? టైర్ వ‌న్ జాబితాలో చేరిపోతారు. జాన్వీక‌పూర్ చాలా వేగంగా చేర‌డానికి ఛాన్స్ ఉంది.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్..చ‌ర‌ణ్ ల‌తో సినిమాలు చేస్తుంది. నెంబ‌ర్ వ‌న్ అవ్వ‌డానికి ఆమెకి ఎక్కువ‌గా అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కానీ నెంబ‌ర్ వన్ అంటే ఫాలోయింగ్ తో పాటు సోలోగా బాక్సాఫీస్ వ‌ద్ద కొట్ల వ‌సూళ్లు తెచ్చే స‌త్తా ఉండాలి. జాన్వీ ప్ర‌యాణం ఇప్పుడే మొంద‌లైంది. తాజా సినిమాల‌తో పాటు భ‌విష్య‌త్ లో ఎలాంటి అవ‌కాశాలు అందుకుంటుంది? బాక్సాఫీస్ వ‌ద్ద ఆమె స్టామినా ఎంత‌? ఇలా అంశాలు జాన్వీ కెరీన్ నిర్దేశిస్తాయి. అలాగ‌ని మిగ‌తా భామ‌ల్ని త‌క్కువ చేయ‌డానికి లేదు. ఇండ‌స్ట్రీలో ఎప్పుడేం జ‌రుగుతుందో? ఎవ‌రూ గెస్ చేయ‌లేనిది. కానీ ఇంకా ఆ రేంజ్ కి మాత్రం ఏ భామ చేరుకోలేదు. దీంతో ఆ స్థానం ఇంకా ఖాళీగానే క‌నిపిస్తుంది.